మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల పద్మవిభూషణ్ గెలుచుకున్న చిరు.. తాజాగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను సైతం అందుకున్నారు. విషయం తెలుసుకున్న చిరు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో ఆయనకు నెట్టింట సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అసలు గోల్డెన్ వీసా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎవరికి ఇస్తుందో తెలుసా?

ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తుంది. దీని కాల పరిమితి పదేళ్లు. గతంలోనూ చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన నటులు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వారిలో టాలీవుడ్ నుంచి అయితే అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక వివిధ ఇండస్ట్రీల నుంచి షారుఖ్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులున్నారు.

మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ లో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలుహైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఇకపోతే మూవీలో ఐదుగురు హీరోయిన్లు ఉండగా.. ఇప్పటికే ఇద్దరిని చిత్ర యూనిట్ ప్రకటించింది. మిగిలిన ముగ్గురి పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Google News