అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘పుష్ప’ విలన్.. తగ్గే మార్గమే లేదట..

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘పుష్ప’ విలన్.. తగ్గే మార్గమే లేదట..

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తెలియనిదెవరికి? జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన సింప్లిసిటీ, నటనకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులోనూ ఫహాద్ ఫాజిల్‌కి మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు వారి మైండ్‌లలో ఫిక్స్ అయిపోయాడు.

ప్రస్తుతం ‘పుష్ప 2’లో సైతం ఫహాద్ ఫాజిల్ న‌టిస్తున్నాడు. సెకండ్ పార్ట్‌లో అత్యంత కీలకమైన పాత్రలలో ఫహాద్ ఫాజిల్ పాత్ర కూడా ఒకటి. ఇటీవలే ఆవేశం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని.. ఈ సినిమాను రూ.100 కోట్ల దిశగా పరుగులు పెట్టించాడు. ఇక తాజాగా ఫహాద్ ఫాజిల్ చెప్పిన ఓ న్యూస్ ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయనకు ఓ అరుదైన వ్యాధి ఉందట.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘పుష్ప’ విలన్.. తగ్గే మార్గమే లేదట..

ఇటీవల కేర‌ళ‌లోని ఒక చిల్డ్రన్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా పహాద్ ఫాజిల్ హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో పహాద్ మాట్లాడుతూ.. తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిసార్డర్ వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు. ఈ ఏడీహెచ్‌డీ అనే వ్యాధి కారణంగా ఏకాగ్రత లేకపోవడం.. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలన్నీ ఉంటాయి. చిన్న వయసైతే ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చట. కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయట పడటంతో జీవితాంతం ఇబ్బంది పడాల్సిందేనని వెల్లడించాడు.