పెళ్లి చేసుకుని మూడు నెలలు కాకముందే బ్రేకపా?

పెళ్లి చేసుకుని మూడు నెలలు కాకముందే బ్రేకపా?

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం ఈ సినిమా షూట్‌లో నిర్ణయమవుతాయనుకుంటా. అందుకే పెద్దగా కలిసుండరు. ఓ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న మూడు నెలలకే షాక్ ఇచ్చింది. అసలా హీరోయిన్ ఎవరు? ఏమా కథ అంటే.. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌, నటి దివ్య అగర్వాల్‌‌ది. ఈ ముద్దుగుమ్మకు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. ప్రియుడు వరుణ్‌ సూద్‌తో నాలుగేళ్ల పాటు నడిపిన ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 

ఈ బ్రేకప్ వార్తను బయట పెడుతూ.. అప్పుడొక భారీ కొటేషన్ చెప్పింది. ఇక తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నానని అందుకే బ్రేకప్ అనేసింది. మరి కోరుకున్న జీవితాన్ని గడిపిందా? అంటే ఆ వెంటనే వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. ఆ వెంటనే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఇద్దరూ ఘనంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకున్నారు. అంతా బాగుందనుకుండగానే మళ్లీ షాక్ ఇచ్చింది. 

పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్‌ మీడియాలో నుంచి తీసేసింది. విడాకులు తీసుకోవడానికి ముందు సెలబ్రిటీలంతా చేసిన పని ఇదే. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. కొంతమందైతే పైకి అనేస్తారు. మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరమంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటా అని కూడా ప్రశ్నిస్తున్నారు.