రాజమౌళికి సిరివెన్నెల స్ట్రాంగ్ వార్నింగ్..!

రాజమౌళికి సిరివెన్నెల స్ట్రాంగ్ వార్నింగ్..!

టైటిల్ చూసి వండర్ అవుతున్నారా? నిజమే కదా.. దర్శకధీరుడు రాజమౌళికి హెచ్చరికలు జారీ చేయడమంటే మామూలు విషయం కాదు.. మరి అందాక ఎందుకొచ్చిందంటారా? ఇంతకీ ఏం జరిగిందంటారా? తాజాగా సిరి వెన్నెలతో తన వ్యక్తిగత అనుబంధాన్ని రాజమౌళి గుర్తుచేసుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తామందరికీ తన పెద్దనాన్నే పేర్లు పెట్టారని రాజమౌళి తెలిపారు.శ్రీశైల శ్రీ రాజమౌళి అని.. మరకతమణి కీరవాణి ఇలా అరుదైన పేర్లు పెట్టారట. 

తమ పేరు వింటున్నప్పుడల్లా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుందని రాజమౌళి తెలిపారు. తన కూతురికి సైతం అలాంటి పేరే పెట్టాలనుకున్నారట. కానీ దొరకక పోవడం సిరివెన్నెల రాసిన ‘విధాత తలపున ప్రభవించినది’ పాట నుంచి మయూఖ అనే పదాన్ని తీసుకుని కూతురికి పెట్టారట. ఇక రాజమౌళికి పద్మశ్రీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని తీసుకోవడం కోసం ఆయన వెళ్లకూడదనుకున్నారట. ఇదే విషయాన్ని ఎవరూ నొచ్చుకోకుండా చెప్పాలనుకున్నారట. 

ఆ సమయంలో సిరివెన్నెల ఫోన్‌ చేస్తే వెళ్లట్లేదని చెప్పారట. మరి ఎవరికైనా కోపం రాదా? పద్మశ్రీ వస్తే తీసుకోనంటే అతి కాకపోతే ఏంటి? ఆరోజు మొదటిసారి తనను సిరివెన్నెల కోపంగా తిట్టారని రాజమౌళి వెల్లడించారు. ‘భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని భావించి.. పురస్కారం అందిస్తుంటే ఎందుకు తీసుకోవు. అతి వేషాలు వేయొద్దు.. నోరు మూసుకొని వెళ్లి తీసుకో’ అని కోపంగా అన్నారని చెప్పారు. అందుకే ఆ వేడుకకు వెళ్లి పురస్కారం తీసుకున్నానని రాజమౌళి వెల్లడించారు.