పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరంటే..

పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప 2’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పుష్ప 2పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పుష్ఫకు పార్ట్ 2 ఏమాత్రం తగ్గకూడదని మేకర్స్ సైతం చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందిస్తున్నారు.

ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టింది. ప్రస్తుతం పతాక సన్నివేశాలను ఈ చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్‌లో పోరాట ఘట్టాలతోపాటు, కొన్ని  టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పార్ట్ 1లో స్పెషల్ సాంగ్‌కు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అంటూ యూత్‌ని ఒక ఊపు ఊపేసింది సమంత. ఇప్పుడు ఇదే జోష్‌తో పార్ట్ 2లోనూ ఒక స్పెషల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ పెట్టనుందట. ఇది పతాక సన్నివేశాల తర్వాత ఉంటుందట. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారనే విషయం మాత్రం బయటకు రాలేదు కానీ స్టార్ హీరోయినే అయి ఉంటుందని అంతా బావిస్తున్నారు. అయితే స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచే తీసుకుంటారని మరో టాక్ కూడా ఉంది.