హీరోయిన్ ఒప్పుకోలేదని రెండు నెలల తర్వాత హీరోని తప్పించారట..

హీరోయిన్ ఒప్పుకోలేదని రెండు నెలల తర్వాత హీరోని తప్పించారట..

సినిమాల్లో బాగా క్లిక్ అయి మంచి ఫామ్‌లో ఉంటే చాలు.. ఏం చేసినా చెల్లుతుంది. వారు చెప్పిందే వేదంగా మారుతుంది. ఇక మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన రజనీశ్ దుగ్గల్ స్టార్టింగ్ స్టార్టింగే దెబ్బ తిన్నాడట. ఇతను మిస్టర్‌ ఇండియా, మిస్టర్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాడు. 1920 హారర్‌ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను రజనీశ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 

తొలుత తనకు యాకీన్ సినిమా అవకాశం వచ్చిందని.. హీరోయిన్ వద్దన్నదని రెండు నెలల తర్వాత తీసేశారని చెప్పాడు. యాకీన్‌ సినిమా కోసం ఫస్ట్‌ తననే హీరోగా అనుకున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం సైన్ చేయడం.. కసరత్తులు సైతం ప్రారంభించేవాడట. డైరెక్టర్‌ గిరీశ్‌ ధమిజ తనకు ట్రైనింగ్ ఇచ్చారని రజనీశ్ తెలిపాడు. ఒకేసారి తనతో వాళ్లు మూడు సినిమాలకు సంతకం చేయించుకున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారట.

తను ముంబైలోని జుహులో ఓ పెంట్‌హౌస్‌లో ఉంచడంతో పాటు ఒక కారు, డ్రైవర్‌ను ఇచ్చారని రజనీశ్ తెలిపాడు. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు.. గదిలోకి ఫుడ్‌ తీసుకొచ్చేవాళ్లట. రెండు నెలల ట్రైనింగ్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నాడట. బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్ అన్నింటినీ పక్కన పెట్టేశాడట. సడెన్‌గా ఒకరోజు రాత్రి నిర్మాత సుజిత్‌ కుమార్‌ ఫోన్‌ చేసి తన ఆఫీస్‌కు రమ్మన్నారట. ఏంటా అని వెళితే..  ప్రియాంక చోప్రా కొత్త వ్యక్తులతో పని చేయనంటోందని.. ఆమె ఎంత పెద్ద హీరోయినో తెలుసా కదా.. ఆమెకు ఆల్‌రెడీ చాలా డబ్బు ఇచ్చేశాం కాబట్టి నువ్వు వద్దు అని చెప్పారని రజనీశ్ తెలిపాడు.

Google News