వాళ్లిద్దరి గురించి వినడం, మాట్లాడటం జాన్వీకి చాలా ఇష్టమట..

వాళ్లిద్దరి గురించి వినడం, మాట్లాడటం జాన్వీకి చాలా ఇష్టమట..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుత సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌లో జాన్వీ చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు చేస్తూ తన గురించి మాత్రమే కాకుండా.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. జాన్వీకి చరిత్ర అంటే చాలా ఇష్టమట.

ప్రత్యేకంగా మహాత్మా గాంధీతో పాటు బీఆర్ అంబేద్కర్ అంటే తనకు చాలా ఇష్టమని జాన్వీ తెలిపింది. వారి గురించి వినడం మాత్రమే కాకుండా మాట్లాడట కూడా తనకు ఇష్టమని వెల్లడించింది. వీరిద్దరూ సమాజానికి ఎంతో సాయం అందించడమే కాకుండా స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపింది. ఈ ఇద్దరికీ సంబంధించి ఏ అంశమైనా తనకు ఆసక్తికరంగానే ఉంటుందని.. కుల వ్యవస్థపై అంబేద్కర్ దృక్కోణం చాలా కఠినంగానే ఉండేదని పేర్కొంది.

ఇక సెలబ్రిటీల ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారని.. అందుకే ఫోటో గ్రాఫర్లు తారలు కనిపించగానే ఫోటోలు తీస్తుంటారని జాన్వీ తెలిపింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 25 సార్లు విమానయానం చేశానని.. తాను విమానాశ్రయానికి వెళ్లే వరకూ ఫోటో గ్రాఫర్లు సిద్ధంగా ఉండేవారని జాన్వీ వెల్లడించింది. అలాగే జిమ్‌ల వద్ద కూడా ఫోటో గ్రాఫర్లు సిద్ధంగా ఉంటారని.. తనను ఫోటోలు తీయవద్దని చాలా సార్లు అభ్యర్థించినట్టు జాన్వీ తెలిపింది. ఎందుకంటే జిమ్ దుస్తులు కాస్త బిగుతుగా ఉంటాయని.. అలాంటి దుస్తుల్లో తన ఫోటోలు వైరల్ అవడం తనకు ఇష్టం లేదని జాన్వీ వెల్లడించింది.

Google News