ప్రభాస్ తర్వాత నాగ చైతన్య.. వీడియో వైరల్

ప్రభాస్ తర్వాత నాగ చైతన్య.. వీడియో వైరల్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తున్న సినిమా ‘కల్కి 2898’. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమాలో స్టార్ తారాగణం నటించింది. హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. ఇతర కీలక పాత్రల్లో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ తదితరులు నటించారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది.

ఈ క్రమంలోనే తన లైఫ్‌లోకి ఒకరు రాబోతున్నారంటూ ప్రభాస్ ఊరించి ఉసూరు మనిపించిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ పోస్టులతో బుజ్జిని అయితే పరిచయం చేశాడు. ఇప్పుడు బుజ్జి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆసక్తికరంగా ఈ సినిమా మేకర్స్ బుజ్జితో పాటు భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ ఒక ఈవెంట్‌నే నిర్వహించడం గమనార్హం.

బుజ్జి అనేది కారు పేరు. ఇది కథలో చాలా కీలకమట. అయితే ఈ కారును ప్రభాస్ డ్రైవ్ చేసుకుంటూ సందరడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వాహనాన్ని అక్కినేని హీరో నాగ చైతన్య కూడా నడిపాడు. దీనిని చూసి వండర్ అయిపోయాడు చైతు. అంతేకాదు.. బుజ్జిని తయారు చేశారా? అంటూ ఒక ఫన్నీ కామెంట్ కూడా చేశాడు. బుజ్జిని నాగచైతన్య డ్రైవ్‌ చేసిన వీడియోను మేకర్స్‌ షేర్‌ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.