ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇచ్చుకున్నారని..

ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇచ్చుకున్నారని..

సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు అంతూ పొంతు ఉండదు. సెలబ్రిటీలు ఒక చోట కనిపిస్తే చాలు.. ఇంకేముంది వారిద్దరి మధ్య ఏదో నడవటం కాదు పరిగెత్తుతోందంటూ ప్రచారం చేస్తారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఇలాంటి రూమర్స్ బారిన పడిన వారే. ఇటీవల మృణాల్ ఠాకూర్ సైతం బాద్‌షాతో కనిపించడంతో పెద్ద ఎత్తున పుకార్లకు తెర లేచింది. 

బాద్ షా తమ మధ్య ఏమీ లేదు బాబోయ్ అని స్వయంగా చెప్పడంతో అంతా సైలెంట్ అయ్యారు. ఆ తరువాత పాకిస్తాన్ నటి హనియా అమిర్‌తో బాద్‌షా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ రచ్చ లేపారు. వీరిద్దరూ ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇచ్చుకోవడమే పుకార్లకు కారణం. ఆపై ఇద్దరూ దుబాయ్‌లో మీట్ అయ్యారు. ఇక అంతే.. అవి పుకార్లు కావు.. అక్షరాలా నిజాలంటూ రచ్చ రచ్చ చేశారు. 

ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ హనియా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే యత్నం చేసింది. తాము రిలేషన్‌షిప్‌లో లేమని.. అవన్నీ పుకార్లేనని తెలిపింది. తాను పెళ్లి చేసుకోకపోవడమే పెను సమస్య అని.. తాను పెళ్లి చేసుకుని ఉంటే ఇలాంటి రూమర్లు ఉండేవి కాదని తెలిపింది. తాను ఇన్‌స్టాలో పెట్టిన రీల్‌పై బాద్‌షా కామెంట్ పెట్టాడని.. ఆ తరువాత అతను తనకు నేరుగా మెసేజ్ చేశాడని అలా ఇద్దరం మాట్లాడుకున్నామని తెలిపింది. బాద్‌సా తనకు దొరికిన గొప్ప మిత్రుడని హనియా తెలిపింది.

Google News