ఫేక్ బేబీ బంప్ అంటున్న వారికి ఇచ్చి పడేస్తుందట..

ఫేక్ బేబీ బంప్ అంటున్న వారికి ఇచ్చి పడేస్తుందట..

స్టార్ హీరోయిన్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ నాటకాలాడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటారా? బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లి కాబోతోంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రెగ్నెంట్‌తో ఉన్నా కూడా భర్తతో కలిసి ఓటేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లింది. ఆ సమయంలో దీపికా పదుకొణె బేబీ బంప్‌తో కనిపించింది. 

దీపిక తల్లి కాబోతోందంటూ వార్తలు వచ్చిన నాటి నుంచి ఆమె సరోగసి ఆప్షన్‌ను ఎంచుకుందంటూ ప్రచారం నడిచింది. దీపిక బేబీ బంప్‌తో కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పడినట్టుగా అయ్యింది. అయితే మాత్రం కొందరు ఆమెను అనుమానిస్తూనే న్నారు. ఆమెది నిజమైన బేబీ బంప్ కాదని.. అంతా నాటకమని చెబుతున్నారు. దీపికకు కొందరు సెలబ్రిటీలు సపోర్టుగా నిలిచారు. 

ఈ క్రమంలోనే దీపిక ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. మరికాసేపట్లో తాను లైవ్‌లోకి రాబోతున్నానని అప్పటి వరకూ వెయిట్ చేయాలంటూ పోస్ట్ పెట్టింది. అయితే దీపిక తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడనుందని.. ట్రోలర్స్‌కి గట్టిగా సమాధానం ఇస్తుందని అంతా భావించారు. మరి దీపిక ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చి ఏం మాట్లాడనుందోనని ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దీపిక మాత్రం పెళ్లైన ఆరేళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు.

Google News