Suseki Song: హమ్మయ్యా.. మరోసారి పుష్ఫ, శ్రీవల్లిల దర్శనం

హమ్మయ్యా.. మరోసారి పుష్ఫ, శ్రీవల్లిల దర్శనం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సీక్వెల్‌ ‘పుష్ప2’. అంతకు ముందు వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దీనిపై సుక్కు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా పుష్ప సక్సెస్‌తో పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి ఏమాత్రం తగ్గినా కూడా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని అల్లు అర్జున్, సుకుమార్‌లు తెగ కష్టపడుతున్నారు.

సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..

ఈ చిత్రంలోని తొలిపాట విడుదలై ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా.. ఇప్పుడు రెండో సాంగ్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సామీ.. సామీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ‘సామి’ అన్న పదంతో సాంగే విడుదలైంది. ఈ సాంగ్ ఏ రేంజ్‌కు వెళుతుందో చూడాలి. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

హమ్మయ్యా.. మరోసారి పుష్ఫ, శ్రీవల్లిల దర్శనం

ఇకక ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఏ అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశాడట. ఈ సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. ఇదే నిజమైతే ఇంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోల లిస్ట్‌లో బన్నీ టాప్‌లో ఉంటాడు.

Google News