ఊహ గురించిన నిజాన్ని శ్రీకాంత్ ఎన్నాళ్లకు బయటపెట్టాడు?

ఊహ గురించిన నిజాన్ని శ్రీకాంత్ ఎన్నాళ్లకు బయటపెట్టాడు?

హీరో శ్రీకాంత్, ఊహ.. చూడచక్కని జంట. శ్రీకాంత్‌తో వివాహానంతరం సినిమాలకు ఊహ గుడ్ బై చెప్పేసింది. వీరికి ముగ్గురు పిల్లలు. అబ్బాయి అయితే హీరోగా ఒకట్రెండు సినిమాలు కూడా చేశాడు. అయితే ఊహ పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు చేసింది. మరి అలాంటిది పెళ్లితో సినిమాలు ఎందుకు మానేసిందనేది తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ దీనికి సమాధానం ఇచ్చాడు.

సినిమాలు మానేయమని ఊహకు తామెవరం చెప్పలేదని.. ఇది స్వయంగా తనే తీసుకున్న నిర్ణయమని శ్రీకాంత్ తెలిపాడు. తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతే పెళ్లికి సిద్ధమైందని.. ఆ తరువాత ఇక సినిమాల జోలికి వెళ్లలేదన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టాక వాళ్లే తన ప్రపంచమైపోయిందని చెప్పుకొచ్చాడు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం పెద్ద అదృష్టమని శ్రీకాంత్ తెలిపాడు. ఊహను పెళ్లి చేసుకున్న క్షణాలు తన జీవితంలోనే బెస్ట్‌ అని పేర్కొన్నాడు.

పిల్లల విషయానికి వస్తే.. రోషన్‌ సైకాలజీ చదివాడని.. ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడని శ్రీకాంత్ తెలిపాడు. అయితే తాను శ్రీకాంత్‌ కొడుకునని ఎక్కడా చెప్పుకోడన్నాడు. ఇక తన కూతురు మేధ కెనడాలో చదువుతోందట. మేధ కూడా అంతేనట.. అక్కడున్న తెలుగువారితో ఎన్నడూ కూడా శ్రీకాంత్‌ తన తండ్రని చెప్పదట. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పిల్లలు తన పేరు ఉపయోగించుకోరని.. రికమండేషన్ల జోలికి వెళ్లరని.. సొంతంగా ఎదిగేందుకు కష్టపడతారని శ్రీకాంత్ తెలిపాడు.