ఇకపై అలాగే చేస్తా.. ఫ్యాన్స్‌కు మాటిచ్చిన రష్మిక

ఇకపై అలాగే చేస్తా.. ఫ్యాన్స్‌కు మాటిచ్చిన రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లో పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవాళ రెండో సింగిల్ కూడా రిలీజైంది. పార్ట్ 2లో రష్మిక అందానికి ఐకాన్‌లా కనిపిస్తోంది. మొత్తానికి ఈ మూవీతో అమ్మడికి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ వచ్చేశారు. తాజాగా రష్మిక టాలీవుడ్‌ మూవీ గంగం గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైంది.

ఈ క్రమంలోనే రష్మికకు ఢిల్లీ ఫ్యాన్స్‌ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం విజ్ఞప్తి చేశారంటారా? తాజాగా ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఫోటోను షేర్ ‍చేస్తూ.. ఈవెంట్‌లో ఆమె చాలా అందంగా కనిపించిందని.. ఆమెను చూడటం చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. అయితే ఆమె తెలుగులో మాట్లాడటంతో వారికి ఏమీ అర్థం కాలేదట. నార్త్‌లోనూ అభిమానులు రష్మిక మాటలు వినేందుకు ఆసక్తి కనబరుస్తారని కాబట్టి ఇక మీదట ఇంగ్లీష్‌లో మాట్లాడాలని కోరారు.

ఫ్యాన్స్ అంతలా అడుగుతుంటే రష్మిక రెస్పాండ్ అవకుండా ఎలా ఉంటుంది? రిప్లై ఇచ్చేసింది.  మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇకపై మీరందరూ అర్థం చేసుకునేలా ఇంగ్లీషులో మాట్లాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చింది. చాలామంది వారి స్థానిక భాషలోనే మాట్లాడాలని అనుకుంటారని.. అందుకే వారి భాషపై ఉన్న గౌరవంతో అలా మాట్లాడుతానని తెలిపింది. ఇకపై దక్షిణాదితో పాటు మీలాంటి ఫ్యాన్స్‌ కోసం ఇంగ్లీషులోనూ మాట్లాడతానని రష్మిక తెలిపింది.