అంజలిని తోసేసిన బాలయ్య.. ఎవరీ స్కంబ్యాగ్ అంటూ నిర్మాత ఫైర్..

అంజలిని తోసేసిన బాలయ్య.. ఎవరీ స్కంబ్యాగ్ అంటూ నిర్మాత ఫైర్..

యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పుడు భారీగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ కారక్యమంలో స్టేజ్‌పై హీరోయిన్ నేహా శెట్టితో పాటు మరో హీరోయిన్ అంజలి కూడా ఉంది. అయితే బాలయ్య.. అంజలిని ఒక్కసారిగా నెట్టడంతో ఆమె పడిపోయినంత పనైంది.

ఒకరకంగా అవాక్కైన అంజలి వెంటనే తేరుకుని సరదాగా నవ్వేసింది. బాలయ్య కూడా ఆమెను ఆట పట్టించాడు. ఆ తరువాత అంజలికి హైఫై ఇచ్చారు. దీనిపై చిత్ర నిర్మాత హన్సల్ మెహతా ట్విటర్ వేదికగా ప్రతిస్పందించారు. ఈ స్కమ్‌బ్యాగ్( చెత్త) ఎవరంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన నెటిజన్.. ఆయన తెలుగు ప్రముఖ స్టార్ నందమూరి బాలకృష్ణ అని.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడని జవాబు ఇచ్చారు.

నెటిజన్ రిప్లైపై స్పందించిన హన్సాల్ ‘స్కంబాగ్ 100’ అని పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. బాలయ్య, అంజలి ఇద్దరూ గతంలో కలిసి నటించారని.. కాబట్టి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు. అలాగే బాలయ్య వయసుతో సంబంధం లేకుండా సహ నటులతో మంచి స్నేహితుడిగా ఉంటాడని వెల్లడించారు. కాబట్టి ఆయనను స్కంబ్యాగ్ అని సంబోధించే ముందు కాస్త తెలుసుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చాడు.