రామ్ చరణ్ రెమ్యూనరేన్ ఏ స్థాయిలో పెంచాడో తెలిస్తే..

రామ్ చరణ్ రెమ్యూనరేన్ ఏ స్థాయిలో పెంచాడో తెలిస్తే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్. ఇప్పటి వరకూ తీసుకుంటున్న దానికి చాలా పెద్ద మొత్తమే పెంచేశాడని అంటున్నారు. మొత్తానికి ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాన్స్ మొత్తం పెద్ద ఎత్తున దీనిపై చర్చించుకుంటున్నారు. అసలే రెమ్యూనరేషన్ హైప్ అంటే  ఇంతకీ అసలు రామ్ చరణ్ ఏ సినిమాకు పెంచాడు? ఎంత పెంచాడు? అని అంటారా? 

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ అయితే అంతర్జాతీయ గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మూడేళ్లుగా జరుగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే నేటికీ ప్రకటించలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఉండొచ్చని మాత్రం దిల్ రాజు కూతురు చెప్పింది. ఇంతకు మించి క్లారిటీ అయితే లేదు. 

మరి ఈ సినిమా కోసం ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట. అయితే అసలు న్యూస్ ఇది కాదు.. దీని తర్వాత సినిమాకు సంబంధించినది. రామ్ చరణ్ నెక్ట్స్ పిక్చర్ కూడా ఫైనల్ అయ్యింది.  ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC16’ వర్కింగ్ టైటిల్‌‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.125 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నాడని టాక్.