‘కల్కి’ చిత్రంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రభాస్..

Prabhas About Kalki

నాగ్‌ అశ్విన్‌ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఈ చిత్రమే. ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు బీభత్సంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లు ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

ప్రభాస్ మాట్లాడుతూ.. ‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుందని.. దీనిని అంతర్జాతీయ ప్రేక్షకులందరినీ దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు తెలిపాడు. కాబట్టి ఈ చిత్రాని బడ్జెట్ భారీగానే అయ్యిందని వెల్లడించాడు. దీనికోసం దేశంలోని స్టార్ తారాగణాన్ని తీసుకున్నట్టు తెలిపాడు.అందరూ తనను పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారని.. ఫ్యాన్స్‌కు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలుస్తారని.. ఆ విషయాన్ని తానసలు పట్టించుకోనని ప్రభాస్ తెలిపాడు. 

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  మాట్లాడుతూ.. ‘‘కల్కి’సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామని ఫీల్ అవుతారన్నారు. ‘అవతార్‌’ చూశాక తాను కూడా అలాగే ఫీలయ్యానని తెలిపారు. అవతార్ చూసినప్పుడు ఒక కొత్త లోకాన్ని చూసిన అనుభూతి కలిగిందన్నారు. ఇప్పుడు ‘కల్కి’ చూశాక కూడా ప్రేక్షకులకు అదే ఫీలింగ్ కలుగుతుందని నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ సినిమాలోని పాత్రల పేర్లు ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని పెట్టామని వెల్లడించారు.

Google News