అమలాపాల్ ప్రెగ్నెన్సీ.. అది ఉత్త ఫేక్ అట..

అమలాపాల్ ప్రెగ్నెన్సీ.. అది ఉత్త ఫేక్ అట..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు అయితే ఎక్కువగా నెట్టింటే కాలం గడిపేస్తున్నారు. కెరీర్, పర్సనల్ విషయాలను కొందరు హీరోయిన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు.  ప్రస్తుతం అమలాపాల్ ప్రెగ్నెంట్‌తో ఉంది. ఈమె గతంలో ఏమో కానీ.. ప్రస్తుతమైతే మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిపోయింది. తను గర్భంతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. 

మలయాళీ బ్యూటీ అమలా పాల్.. 2009లో ఇండస్ట్రీకి వచ్చింది. బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘నాన్న’ అనే తమిళ మూవీ చేస్తున్న టైంలోనే ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ను ప్రేమించి 2014లో పెళ్లి చేసుకుంది. అయితే మూడేళ్లకే వారిద్దరూ విడిపోయారు. తిరిగి గతేడాది నవంబరులో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అమలాపాల్ ప్రెగ్నెన్సీ.. అది ఉత్త ఫేక్ అట..

పెళ్లైన రెండు నెలలకే తాను ప్రగ్నెంట్ అని ప్రకటించేసింది. ఇక అక్కడి నుంచి మొదలు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవల అమలా పాల్ ట్విన్స్‌కి జన్మనిచ్చిందంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అదొక ఫేక్ న్యూస్ అని.. అసలు అమలాపాల్‌కి డెలివరీయే జరగలేదని తేలింది. అమలాపాల్‌కు నెలలు అయితే నిండాయి. కానీ ఇంకా డెలివరీ కాలేదు.