ఈ లవ్ బర్డ్స్ విడిపోతున్నాయా? నెట్టింట పెద్ద ఎత్తున చర్చ..

ఈ లవ్ బర్డ్స్ విడిపోతున్నాయా? నెట్టింట పెద్ద ఎత్తున చర్చ..

సినీ ఇండస్ట్రీలో లవ్ అఫైర్, బ్రేకప్ వార్తలకు కొదువేమీ ఉండదు. ఇవి నిత్యం సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్‌లో ఓ స్టార్ జంట బ్రేకప్ చెప్పుకుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ జంట అయితే అసలు వీటిని పట్టించుకోవడం కూడా లేదు. కానీ ఈ విషయం ఇండస్ట్రీలన్నీ పాకేసి రకరకాల చర్చకు దారి తీస్తోంది. ఈ ప్రేమ జంట బంధానికి కాలపరిమితి ముగిసిందని, అందుకే విడిపోయారంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరంటారా? మలైకా అరోరా, అర్జున్‌ కపూర్.. వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరికీ ఒకరిపై మరొకరికి ఎడతెగని ప్రేమ ఉంది. వీరి గురించి బ్రేకప్ వార్తలు వస్తున్నా వాటి గురించి అందుకే వారు పట్టించుకోవడం లేదు. కనీసం దీని కూడా చర్చించేందుకు సైతం ఇష్టపడరు. 2019లో మలైకా, అర్జున్‌‌ల జంట తాము డేటింగ్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఇక ఆ తరువాత పార్టీలు, ఫంక్షన్స్‌కు చక్కగా కలిసి వెళ్లేవారు. 

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసేవారు. అయితే గతేడాదే.. వీరి ప్రేమ బంధం ముగిసిందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిని మలైకా కొట్టిపారేసింది. మలైకా కంటే అర్జున్ 12 ఏళ్లు చిన్నవాడు. దీనిపై కూడా విమర్శలు రాగా.. మలైకా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంతలా కలిసున్న వీరు విడిపోయారంటూ మళ్లీ వార్తలు మొదలయ్యాయి. కానీ ఈసారి వారు స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు.

Google News