చెత్త ఎత్తుతూ దర్శనమిచ్చిన పూజా హెగ్డే

చెత్త ఎత్తుతూ దర్శనమిచ్చిన పూజా హెగ్డే

పూజా హెగ్డే ఫేడ్ అవుట్ అయిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలన్నీ వరుస ఫ్లాపులు అవడంతో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. మొత్తానికి బాలీవుడ్‌లో ఒక మూవీ అవకాశం వచ్చింది. దీనిపైనే పూజా ఆశలన్నీ పెట్టుకుంది. ఇది ఏమైనా తేడా కొట్టిందో ఇక పూజా హెగ్డే కెరీర్ అంతే సంగతులు. ఇక అసలు పూజా హెగ్డే బయట కనిపిస్తున్నది చాలా తక్కువే.

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన పూజ అంతే త్వరగా పడిపోయింది. చాలా కాలం తర్వాత పూజా హెగ్డే బయట కనిపించింది. ఓ క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని తన వంతు బాధ్యత నిర్వర్తించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముంబై జుహూ బీచ్‌లో చెత్త ఎత్తి పర్యావరణ పరిశుభ్రతలో పాలు పంచుకుంది. 

ఈ ముంబై బ్యూటీ 12 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు ఇండస్ట్రీనే అమ్మడికి మంచి స్టార‌్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. వరుస సక్సెస్‌లతో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాతే ఫేట్ మారిపోయింది. వరుస ఫ్లాపులతో ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘దేవ’ అే మూవీ చేస్తోంది. సినిమాలు లేక ఖాళీ ఉండటంతో చిన్న చిన్న ఈవెంట్స్‌లో దర్శనమిస్తోంది.