సుశాంత్ సింగ్ ఫ్లాట్‌లోకి ఆదా శర్మ..

సుశాంత్ సింగ్ ఫ్లాట్‌లోకి ఆదా శర్మ.. 

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను మాత్రం ఇప్పటికీ జనాలు మరచిపోలేరు. కెరీర్ పరంగా బాగా ఎదుగుతున్న సమయంలో ఊహించని విధంగా తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హిందీ ఇండస్ట్రీలోని నెపోటిజం వల్ల ఇలా జరిగిందని రచ్చ రచ్చ జరిగింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోయారు. కొన్ని రోజుల పాటు మీడియా సైతం అతని వార్తలే కవర్ చేసింది.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన ఫ్లాట్‌లో హీరోయిన్ అదాశర్మ మకాం పెట్టేసి హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు నాలుగు నెలల క్రితమే తాను ఈ ప్లేసులోకి షిఫ్ట్ అయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదా శర్మ తెలిపింది. సుశాంత్ ఫ్లాట్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆదా బయటపెట్టింది. తాను నాలుగు నెలల క్రితమే ఈ ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యానని.. కానీ తన సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటం వల్ల సర్దుకోవడం కుదర్లేదని వెల్లడించింది.

ఈ మధ్య పూర్తిగా వస్తువులు, సామాన్లు అన్నీ సర్దేసుకున్నానని… ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని ఆదా తెలిపింది. కేరళ, ముంబయిలోని తమ ఇళ్ల చుట్టూ చెట్లు ఉంటాయని వెల్లడించింది. అందుకే చుట్టూ పచ్చని వాతావరణం ఉన్న ఈ ఇంటికి మారానని చెప్పుకొచ్చింది. కేవలం పచ్చదనం కారణంగానే ఈ ఫ్లాట్‌లోకి వేరే ఏం ఆలోచించకుండా మారిపోయానని అదాశర్మ చెప్పుకొచ్చింది. ‘ద కేరళ స్టోరీ’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆదా మంచి గుర్తింపు తెచ్చుకుంది.