‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీకి సంబంధించిన నెక్ట్స్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి అప్‌డేట్స్ అన్నీ వచ్చేసి రిలీజ్ కూడా వేసవిలో అయిపోయి ఉండాల్సింది కానీ టెక్నికల్ కారణాలతో ఈ నెల 27కి వాయిదా పడింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడానికి ముందే ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే ఎన్నికల కారణంగా కాస్త బ్రేక్ ఇచ్చింది.

ఎన్నికలు ముగియడంతో తాజాగా బుజ్జి పేరుతో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ఎప్పుడనే విషయమై ఓ క్లారిటీ ఇచ్చింది. అసలే ప్రభాస్ మూవీ.. ఆపై నాగ్ అశ్విన్ దర్శకత్వం.. సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా జనాలు బీభత్సంగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ జూన్ 10న విడుదల కానుంది. దీనికి కూడా ఓ ఈవెంట్ నిర్వహించనున్నారు.

బుజ్జి టీజర్ రిలీజ‌తో కారుపై ఆసక్తి బీభత్సంగా పెరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ ఉపయోగించే కారు పేరు బుజ్జి. దీన్ని లాంచ్ చేస్తూ కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ఈవెంట్ పెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ముంబయిలో నిర్వహించున్నారు. ప్రమోషన్స్ పరంగా కూడా ఆలోచించి ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. కల్కి మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు.

Google News