‘మా’ నుంచి హేమ సస్పెన్షన్..

'మా' నుంచి హేమ సస్పెన్షన్..

బెంగళూరు రేవ్ పార్టీతో నటి హేమ తెగ వార్తల్లో నటిస్తోంది. రేవ్ పార్టీలో ఆమె పేరు బయటకు వచ్చీరాగానే తాను హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసి కలరింగ్ ఇచ్చింది. కొన్ని గంటల్లోనే బెంగుళూరు పోలీసులు రేవ్ పార్టీలో హేమ కూడా ఉన్నట్టు ఫోటో విడుదల చేశారు. దీంతో హేమ ఆడుతున్న నాటకాలకు చెక్ పడింది. ఇక అక్కడి నుంచి ఆమెను సమస్యలు చుట్టుముట్టాయి.

ఈ కేసులో హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా తాను ఆ వీడియోను హైదరాబాద్ నుంచే చేశానంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని.. అసలు తనకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని తెలిపింది. అయితే డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి హేమను తమ సంస్థ నుంచి సస్పెండ్ చేయాలని ‘మా’ నిర్ణయించినట్లుగా సమాచారం. ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యుల నుంచి డిమాండ్లు వచ్చాయి. 

డ్రగ్స్ కేసులో హేమ అరస్టైన తర్వాత ‘మా’ సభ్యులు సైతం ఆమె సస్పెన్షన్‌పై ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ‘మా’ కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నుంచి అధికారిక ప్రకటన సైతం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే హేమ సస్పెన్షన్‌పై సభ్యుల నుంచి అభిప్రాయాలను సైతం ‘మా’ సేకరించినట్టుగా తెలుస్తోంది. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు హేమకు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ వచ్చేవరకూ సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.