Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!
అవును..’కల్కి’ న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల చిత్రం!. ప్రేక్షకుని స్థాయిని పెంచిన చిత్రం!. కల్కి తెర ప్రపంచ పేక్షకులను మనవైపు చూసేలా మరోసారి తెర తీసిన చిత్రం!. ఓకే ఒక్క మాటలో చెప్పాలంటే.. కల్కి ఆవిర్భావం… ధర్మానికి, శక్తికి, విజ్ఞానానికి మహా సమరం!. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్.. బాలీవుడ్ కాదు రెబల్ వుడ్ అని అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి.
ఎలా ఉంది..?
భారీ తారాగణం అంతకు మించి బడ్జెట్.. మహానటి లాంటి సినిమా అందించిన నాగ్ అశ్విన్ దర్శకత్వం.. దీనికి తోడు పేరుగాంచిన నిర్మాణ సంస్థ.. వీటి అన్నిటికీ మించి పాన్ ఇండియా సినిమాలకు పెట్టిందే పేరుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించడం.. ఇక సినిమా ఎలా ఉంటుందో ఈ పాటికే అర్ధమయ్యి ఉంటుంది. ఒకటా రెండా ఎన్నో విషయాల కలయిక.. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలం.. ఇలా అన్నిటినీ కలిపి అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు నాగ్ అశ్విన్ తెచ్చాడు.
ఈ భూమ్మీద కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి సమస్త సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించబోతున్నట్టు మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. వీటి ఆధారంగా.. కథ నడుస్తుంది. అశ్వత్థామగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కలిగా కమలహాసన్, భైరవగా ప్రభాస్, దీపిక పదుకొనే సెటిల్డ్ పాత్రలో ఔరా అనిపించారు. ఇక.. కలి ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించాడు..? భైరవ, కల్కి కలిసి దాన్ని ఎలా అడ్డుకున్నారు..? అతన్ని ఎలా అంతం చేశారనేది కథ.
అదిరిపోయిందిగా..!
విజువల్స్ పరంగా బహుశా నాగ్ అశ్విన్ ను ఎవరూ ఢీ కొట్టలేరు అని ఈ సినిమాతో నిరూపితమైంది. తన మైండ్ లో ఏం అనుకున్నాడో అదే స్క్రీన్ మీద చూపించాడు. ఇందులో నాగి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. కొన్ని కొన్ని సన్నివేశాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. భైరవ ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్.. భైరవకి అశ్వద్ధామ మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు గాని ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.
భారీ తారాగణం కావడంతో అందరికీ సమానంగా అదిగో పలానా పాత్రకి అన్యాయం జరిగిందని పాయింట్ ఔట్ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీపిక పాత్ర చాలా ఎమోషనల్.. ఇందులో కొన్ని క్యామియో పాత్రలు కూడా ఉన్నాయి.
గ్రాఫిక్స్ వర్క్ అక్కడక్కడా ఇట్టే తెలిసిపోయినా.. VFX మాత్రం మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ఎపిసోడ్స్ వేరే లెవల్. ఫస్టాఫ్ బోర్ లేకుండా సాగినా.. సెకండ్ హాఫ్ కాస్త బోర్ అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ అదుర్స్ అంతే. ప్రభాస్ మాత్రం ఎక్కువసేపు కనిపించకపోవడం పెద్ద మైనస్. ఇక దీపిక మాత్రం తనకు ఇచ్చిన పాత్రలో జీవించేసిందని చెప్పుకోవచ్చు.
ఈ వయసులో కూడా బిగ్ బీ ఇలా నటిచారంటే నిజంగా గ్రేట్. ఇక మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ ఎక్సలెంట్. చివరిగా.. సినిమా ఎండింగ్ లో స్క్రీన్ కోసం ప్రభాస్, బిగ్ బి పోటీ పడ్డారు అనిపించింది..!