Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas) సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాక అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ అందింది. అదేమిటంటే.. డార్లింగ్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా వచ్చే ఏడాదిలో కూడా రిలీజ్ కాదట. అంటే ముందుగా అనుకున్న జూన్‌లో ప్రభాస్ సినిమా రిలీజ్ కాదన్న మాట.
వాస్తవానికి వచ్చే ఏడాది జనవరికే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. పలు కారణాలతో జనవరి కాస్త జూన్ అయ్యింది. ఇప్పుడు చూస్తే జూన్‌లో కూడా లేదట. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్‌కే క్లారిటీ లేదట. విజువలైజేషన్‌కు మరింత మెరుగులు దిద్దేందుకు జూన్ దాటిపోతుందట. అక్టోబర్‌లో రిలీజ్ అయిన టీజర్‌లో మొత్తం ఆనిమేషన్‌గా ఉందని విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. ఆ పాత్రలు సరిగ్గా లేవని జాతీయస్థాయిలో వివాదం కూడా చెలరేగింది. దీంతో వాటన్నింటినీ చక్కబెట్టే పనిలో మేకర్స్ ఉన్నారట. దీంతో జూన్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) జానకీదేవిగా.. సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
ఈ మధ్యే అన్‌స్టాపబుల్‌లో అయినా తమ హీరో కనిపించాడని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. ఇంతలోనే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఇదేం ఖర్మ రా బాబూ.. క్లారిటీ లేకుండా సినిమా తీస్తే ఇలానే ఏడ్చినట్లు ఉంటుందని మేకర్స్‌పై కన్నెర్రజేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans). ‘ఆదిపురుష్’ (Adipurush Movie) రిలీజ్‌పై నెలకొన్న ఈ సస్పెన్షన్‌కు తెరదించేదెవరో చూడాలి మరి.