Waltair Veerayya: వాల్తేరు వీరయ్య’పై షాకింగ్ కామెంట్స్.. తొందరపడి..!

Waltair Veerayya

ఉమైర్ సంధు.. (Umair Sandu) కాస్త సినిమాల గురించి ఉన్నవారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తనను తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌గా చెప్పుకుంటూ.. ఇష్టానుసారం రివ్యూలు ఇస్తా అందరి చేత బూతులు తిట్టించుకుంటూ ఉంటాడు. సర్వం తనకే తెలుసని.. సినిమా చూడకుండానే చూసేశానని.. అదిగో అది బాలేదు.. ఇది బాలేదని ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. బహుశా ఇప్పటి వరకూ ఫలానా సినిమా ‘బాగుంది’ అనే మాట చెప్పిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువే. అలా పాపులర్ అయిన క్రిటిక్ ఉమైర్ సంధు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాపై పడ్డాడు. సినిమా రిలీజ్ కాకముందే అదేదో పాట ఉంది కదా.. తొందరపడి ఓ కోయిల అన్నట్లుగా ట్విట్టర్ పిట్టలో కూసేశాడు.

Waltair Veerayya Review 2

సంక్రాంతి పొంగల్‌కు చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veerasimha Reddy) రిలీజ్ కాబోతున్నాయ్. రెండు సినిమాలు కూడా ఒక్కరోజు గ్యాప్‌లోని రిలీజ్ అవుతున్నాయి. చిరు మాత్రం జనవరి-13న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. కచ్చితంగా మెగాస్టార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్విట్టర్‌లో కారు కూతలు కూశాడు ఉమైర్ సంధు. సినిమా గురించి చెప్పడమే కాదు.. చిరుకు ఉచిత సలహాలు కూడా ఇచ్చాడు.

Waltair Veerayya Review

‘చిరంజీవి (Megastar Chiranjeevi) గారు దయచేసి ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చేయడం ఆపేయండి. మీ నుంచి ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చూసి చూసి బోర్ కొట్టేసింది. ఇకనైనా మీరు సీరియస్ రోల్స్ చేయండి. వాల్తేరు వీరయ్య చిరంజీవికి మరో డిజాస్టర్ కానుంది’ జోస్యం చెప్పాడు ఉమైర్ సంధు. ఈ ట్వీట్ ఇప్పుడు పలు సంచలనాలకు దారితీసింది. శుభమా అని సంక్రాంతికి వస్తుంటే ఈయన గొడవేంట్రా బాబూ అని కొందరు చిరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇతనికి పనీపాటేమీ లేదు.. అందుకే ఇలా మొరుగుతున్నాడని మరికొందరు ఫ్యాన్స్ కన్నెర్రజేస్తున్నారు. ఇక వాళ్లు.. వీళ్లు చెప్పేదేముందిలే కానీ.. అసలు సినిమా ఎలా ఉందో.. రివ్యూల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియాలంటే జనవరి-13 వరకు వేచి చూడాల్సిందే మరి.

Google News