Chiranjeevi: బెస్ట్ ఫ్రెండ్ కోసం స్టోరీ లైన్ రాసిన చిరు!

Chiranjeevi Story Line

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)- రాధిక (Radhika) కాంబో గురించి ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈ ఇద్దరు కలిసి నటించారో ఆ సినిమా బ్లాక్ బ్లస్టరే. అందుకే ఈ జంటను సూపర్ హిట్ కాంబోగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు.. చిరుతో పోటీపడి మరీ డ్యాన్స్ చేయగల నటీమణుల్లో రాధికదే మొదటిస్థానం. సినిమాల్లోనే కాదు.. ఈ ఇద్దరు రియల్ లైఫ్‌లోనూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం అటు చిరు.. ఇటు రాధిక చాలా సందర్భాల్లోనే చెప్పారు. రెండ్రోజులుగా నెట్టింట్లో ఈ జంట గురించి ఓ వార్త బాగా హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. చిరు-రాధిక (Chiranjeevi-Radhika) కాంబోలో సినిమా వస్తోందన్నదే దాని సారాంశం. అయితే అది ఇద్దరూ కలిసి నటుస్తున్నది కాదట.

Chiranjeevi Radhika

ఈ కాంబోలో.. రాధిక నిర్మాతగా, చిరు హీరోగా వ్యవహరిస్తున్నారట. అంటే ఇలా ఈ ఇద్దరి కాంబో సెట్ కాబోతోందట. రాడాన్‌లో సినిమా చేస్తానని చిరు ఎప్పుడో మాటిచ్చాడు. ఆ సమయం ఆసన్నమైందట. ఇటీవలే రాధిక భర్త.. శరత్ కుమార్ (Sarath Kumar).. చిరును సినిమా గురించి గుర్తు చేశారట. తాను రెడీగా ఉన్నానని చెప్పేశాడట మెగాస్టార్. మంచి కథతో రావాలని సూచించాడట చిరు. దీంతో కొన్నిరోజులుగా కొంత మంది రచయితలతో రాధిక మంతనాలు జరుపుతోందని టాక్. చిరుకు సెట్ అయ్యే కథ ఎవరి దగ్గరుందా అని అన్వేషిస్తోందట.

మరోవైపు.. చిరు కూడా స్టోరీ లైన్ రాసిపెట్టారట. ఒకరిద్దరు రచయితలకు ఆ లైన్ చెప్పి స్టోరీ రాయించే బాధ్యత అప్పగించారని ఫిల్మ్‌నగర్ కథనాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు దొరికితే ఇక చిరు-రాధిక కాంబోలో మూవీ పట్టాలెక్కనుందన్న మాట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలో ప్రాజెక్టును ప్రారంభించాలని రాధిక అనుకుంటున్నారట. మరి కథ ఎలా ఉంటుంది..? దర్శకుడు ఎవరు..? అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Google News