Upasana Konidela: రూమర్స్‌కు చెక్‌పెట్టిన ఉపాసన.. క్లియర్ కట్..

Upasana Konidela Clears Rum

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్-ఉపాసన (Ram Charan – Upasana Konidela) తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తతో ఏళ్ల తరబడి సాగిన మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. స్వయంగా మెగాస్టార్ చిరునే ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సరోగసి ద్వారా ఈ దంపతులు పేరెంట్స్‌ అవ్వబోతున్నారని చిరు ప్రకటన నాటి నుంచే రూమర్స్ వస్తున్నాయ్. మెగా కాంపౌండ్ నుంచి ప్రకటన వచ్చింది కానీ.. దీనిపై మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో.. మళ్లీ మెగా ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు.

Upasana Konidela Clears 2

తాజాగా సింగిల్ ఫొటోతో ఆ రూమర్స్‌ అన్నింటికీ చెక్ పెట్టేశారు ఉపాసన. చెర్రీ-ఉపాసన థాయిలాండ్ టూర్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఉన్న ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఉపాసన. ఈ ఫొటోల్లో ఉప్సీ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో రెడ్ లాంగ్ ట్రెండీ వేర్‌లో ఉపాసన ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ డ్రస్ కొంచెం టైట్‌గా ఉంది. దీంతో ఉపాసన బేబీ బంప్ రివీల్ అయ్యింది. ప్రేగ్నెన్సి ప్రకటించాక ఫస్ట్ టైం ఉపాసన తన బేబీ బంప్ ఇలా రివీల్ చేసింది. దీంతో విమర్శకులు, ఫ్యాన్స్ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ ఫొటోలు మెగాభిమానులకు ఎక్కడలేని సంతోషం తెచ్చిపెట్టాయి.

Upasana Konidela Clears 3

నిన్న.. మొన్నటి వరకూ ఉపాసన గర్భం దాల్చలేదని.. చరణ్ దంపతుల బిడ్డ వేరే మహిళ గర్భంలో పెరుగుతోందని కొందరు విమర్శించారు. మరికొందరు సోషల్ మీడియాలో తెగ రాసేశారు కూడా. సో.. తాజాగా ఫొటోలతో చెర్రీ దంపతులు సరొగసీ ఆశ్రయించలేదన్న విషయం నిర్ధారణ అయ్యింది. ఈ మధ్యే నయనతార సరోగసి వ్యవహారం పెద్ద రచ్చే అయ్యింది. దీంతో సరోగసి అనే సరికి మెగా ఫ్యాన్స్‌ కాస్త ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏదైతేనేం ఒక్క ఫొటోతో విమర్శకుల నోరు మూయించేసింది ఉప్సీ.

Google News