Samantha: సమంతపై ఆ ప్రచారం అంతా అబద్ధమే..

Samantha Health Condition

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మొన్న చైతు-సామ్ డివోర్స్‌పైన సుమారు ఆరేడు నెలల పాటు ఇవే వార్తలు. నిన్న అంతా వయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు వార్తలు. ఇప్పుడు ఏకంగా ఆరోగ్యం క్షీణించిందని.. అత్యవసర చికిత్స తీసుకుంటోందని.. సినిమాలకు దూరమైపోయిందని ప్రచారం జరిగింది. ఇలా ప్రతిరోజూ సమంత (Samantha Ruth Prabhu) పై పగపట్టినట్లుగా కొందరు పనిగట్టుకుని మరీ వార్తలు రాసేస్తున్నారు. ఈ మొత్తం రూమర్స్‌కు సమంత ప్రతినిధులు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.

సామ్ ఆరోగ్యంపై వస్తున్న కథనాల్లో నిజంలేదని.. అభిమానులు ఎవరూ ఈ వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశారు. సినిమా షూటింగ్‌లకు గ్యాప్ రావడంతో సమంత (Samantha) విశ్రాంతి తీసుకుంటోంది కానీ.. సినిమాలకు దూరం కాలేదని ఒకింత విమర్శకులకు కౌంటరిచ్చినట్లు మాట్లాడారు. సంక్రాంతి తర్వాత సామ్ షూటింగ్స్‌లో బిజీ అవుతారని.. అప్పటి వరకూ రెస్ట్ తీసుకుంటారన్నారు. మొదట రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘ఖుషీ’ (Kushi) సినిమా షూటింగ్‌లో.. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలలో బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తారని స్పష్టం చేశారు.

Samantha Health Condition2

జనవరిలోనే బాలీవుడ్ (Bollywood) సినిమా షూటింగ్ ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు సామ్ ప్రతినిధులు. సినిమా ఆర్నెళ్లపాటు వాయిదా పడే అవకాశం ఉందన్నారు. అయితే.. సామ్ కోసం వెయిటింగ్ చేయడం ఇబ్బంది అనుకుంటే షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుపుకోవాలని మేకర్స్‌కు క్లారిటీగా చెప్పేశామన్నారు ప్రతినిధులు. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యే వరకూ కొత్త ప్రాజెక్టులేమీ ఒప్పుకోవట్లేదన్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఓప్పుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి సామ్ (Samantha) తప్పుకునే ప్రసక్తే లేదని ప్రతినిధులు తేల్చి చెప్పారు. సో.. ఈ క్లారిటీ సరిపోతుందిగా.. ఇకనైనా సామ్ గురించి నెగిటివ్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడితే మంచిదేమో అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Google News