Bandla Ganesh: బండ్లన్నను ఈ రేంజ్‌లో మోసం చేసిందెవరు..?
నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్ (Bandla Ganesh). హీరోను మించి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఇంటి నుంచి బయటికొచ్చినా.. సోషల్ మీడియా ఏదైనా రాసుకున్నా.. అంతకుమించి ఇక స్టేజ్ పైకి ఎక్కారో ఈలలు, కేకలే.. అదీ బండ్ల రేంజ్. మరోవైపు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భక్తుడిగా ‘ఈశ్వరా.. పవనేశ్వరా’.. అంటూ మెగాభిమానుల మదిలో చోటు సంపాదించుకున్నాడు. పవన్‌ను పొలిటికల్‌గా.. సినిమా పరంగా ఎవరైనా పొల్లెత్తు మాట అన్నారో.. క్షణాల్లో ఊహించని రీతిలో రియాక్ట్ అవుతుంటాడు బండ్లన్న.
ఒక్కోసారి ఈయన పెద్ద పెద్ద లీడర్స్‌కు సైతం స్ట్రాంగ్ కౌంటర్లిస్తుంటాడు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎవరైనా పవన్‌ను విమర్శిస్తే ఒంటికాలిపై లేస్తూ దుమ్ముదులిపి వదులుతుంటాడు. అలాంటి బండ్ల గణేష్ (Bandla Ganesh) కు ఏమైందో ఏమో తెలియట్లేదు కానీ.. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ ఈ ట్వీట్స్ ఎవర్ని ఉద్దేశించి చేశారు.. ఈయన్ను ఎవరైనా మోసం చేశారా అన్నట్లుగా ఆ ట్వీట్స్ సారాంశాలున్నాయ్.
ప్లీజ్.. ప్లీజ్..!
‘జీవితం చాలా చిన్నది.. ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా.. దయచేసి ఎవరిని నమ్మకండి..! ఎవ్వరు మనకు సహాయం చేయరు.. ఎవరు మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది ఇంకో బొమ్మ. ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మీ అందరికి చెబుతున్నా.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరినైనా నమ్మామా.. మన గొంతు మనం కోసుకున్నట్టే. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.. మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి’ అంటూ బండ్ల వరుస ట్వీట్స్ చేశాడు.
ఈ ట్వీట్స్ చూసిన నెటిజన్లు.. చిత్రవిచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. అన్న చెప్పిందే అక్షరాలా నిజమే అని కొందరు అంటుంటే.. స్వామీ అంతలా తాగేశావా ఏంటి ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘కొంపదీసి మీ దేవుడు పవన్ కల్యాణ్ ఏమైనా మోసం చేశాడా ఏంటి..’ మరికొందరు నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. ‘అసలు ఏం మాట్లాడుతున్నావో.. కనీసం తమరికైనా అర్థం అవుతోందా అన్నా.. రాత్రిపూట కదా ఇలాంటి మాటలే వస్తాయ్‌లే.. పొద్దుగాళ్ల మాట్లాడదాం లే పడుకో అన్నా’ అంటూ గుడ్ నైట్‌తో మెసేజ్‌లు చేస్తున్నారు నెటిజన్లు. ఆ ట్వీట్ వెనకున్న ఆంతర్యమేంటో బండ్లన్నకే తెలియాలి మరి.