Anupama Parameswaran: అటు తిరిగి.. ఇటు తిరిగి మళ్లీ అనుపమ దగ్గరికే..!

Anupama Parameswara Dj Tillu

డీజే టిల్లు.. (DJ Tillu) ఈ సినిమా కుర్రకారుకు యమా నచ్చేసింది. ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ మొదలుకుని సినిమా రిలీజ్ వరకూ పెద్ద సెన్సేషనలే. ఎక్కడ చూసినా డీజే టిల్లు పాటలే మోత మోగిపోయాయ్. అలాంటి బజ్ పెంచిన ఈ సినిమా సీక్వెల్ డీజే టిల్లు-2 (DJ Tillu2) ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమాకు ఇప్పటి వరకూ ఒక్క హీరోయిన్ కూడా సెట్ అవ్వలేదని నిన్న మొన్నటి వరకూ టాక్ నడిచింది.

అప్పట్లో కేరళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)ను సంప్రదించిన మేకర్స్.. కొన్ని రోజులపాటు షూటింగ్‌లో భాగం చేశారు. ఆ తర్వాత కొన్ని బేధాభిప్రాయాల వల్ల కేరళ కుట్టి బయటికొచ్చేసింది. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. ఆ తర్వాత మడోనా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి, శ్రీలీలతో పాటు చాలా మంది హీరోయిన్స్‌ను సంప్రదించిన మేకర్స్.. ఎవరూ సెట్ అవ్వరని తెలిసి.. అటు తిరిగి ఇటు తిరిగి అనుపమ దగ్గరికి వచ్చే ఆగారట. ఈసారి స్ట్రాంగ్ రెకమెండేషన్‌తో రావడంతో కాదనలేకపోయిందని టాక్. రెమ్యునరేషన్ కూడా అడిగినంత ఇస్తామని ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని మేకర్స్ మాటిచ్చారట.

Anupama Parameswara Dj Tillu 2

‘కార్తికేయ-2’ (Karthikeya2)తో భారీ హిట్ అందుకున్నాక ఈ భామకు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. నిఖిల్-అనుమప (Anupama) కాంబోలో ‘18 పేజెస్’ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. మాస్‌మహారాజ్ రవితేజ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ఇక డీజే టిల్లు విషయానికొస్తే.. ఇందులో అందాల ఆరబోత చాలానే ఉంటుంది.. సీక్వెల్‌లో అంతకుమించి కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ మధ్య హాట్ హాట్‌గానే చేయడానికి ముద్దుగుమ్మలు బాగా ఇష్టపడుతున్నారు. అందాలు ఆరబోస్తే అరిగేదేముంది.. తరిగేదేముంది.. ఇంకొన్ని ఛాన్స్‌లు పెరుగుతాయే తప్ప అని అనుపమ కూడా గట్టిగానే నమ్ముతోందట. ఈ వార్తల్లో నిజానిజాలెంత అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాల్సిందే మరి.

Google News