Bigg Boss 7: బిగ్‌బాస్-7కు ఈ ఇద్దరిలో హోస్ట్ ఎవరో..!

Bigg Boss Season 7

Bigg Boss 7: బిగ్‌బాస్ అంటే చాలు జనాలు పడి చచ్చిపోతున్నారు. సీజన్ ముగిసే సరికి మళ్లీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. సీజన్ వస్తే ఇక సీరియల్స్, సినిమాలకు వేటికీ ఈ షోకు వచ్చినంతగా రేటింగ్స్ ఉండవ్. షో ప్రారంభం కావడానికి ఇంకా టైమ్ ఉండగానే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక మొబైల్స్ చూసే వాళ్లు అయితే కోట్ల మందే ఉంటారు. అలా జనాల ఇంట్రెస్ట్‌ను క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు సీజన్లు పెంచుకుంటూ.. ఆరు ముగించారు. నిన్న, మొన్న అలా సీజన్ ముగిసిందో లేదో.. అప్పుడే బిగ్‌బాస్-7 గురించి నిర్వాహకులు ప్లాన్స్ చేస్తున్నట్లు తెలియవచ్చింది.

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఇప్పటి వరకూ హోస్ట్‌గా ఉండగా సీజన్-7కు మాత్రం ‘నాకొద్దు బాబోయ్ ఈ హోస్టింగ్’ అని దండం పెట్టేశారట. షో తో పాటు నాగ్ వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పటివరకూ చేసేదేదో చేశాం.. ఇక ఎందుకని హోస్ట్‌గా చేయనని నిర్వాహకులకు నాగ్ చెప్పేశాడట. దీంతో ఇప్పట్నుంచే నాగ్ రేంజ్ ఎవరికి ఉందా.. ఆ స్టయిల్‌లో ఎవరు నడిపిస్తారని నిర్వాహకులు ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే హోస్ట్‌ల లిస్ట్‌ను తయారు చేశారట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఉన్నారట.

Balakrishna Bigg Boss Host

సెట్ అయితే ఎన్టీఆర్ లేకుంటే బాలయ్య (Balakrishna)ను షోకి హోస్ట్‌గా పెట్టాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్ (NTR).. తన రేంజ్‌ ఏంటో చూపించాడు. పనితీరు కూడా టీఆర్పీ రేటింగ్‌లో తెలిసిపోయింది. కాబట్టి ఆ పాతరోజులు రావాలంటే ఎన్టీఆరే కరెక్ట్ అని ప్లాన్‌ చేస్తున్నారట నిర్వాహకులు.

Ntr Bigg Boss Host

ఇక బాలయ్య విషయానికొస్తే.. ఆహా ఓటీటీ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే-02’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ షోతో తనలో ఉన్న మరో యాంకర్ కళను బయటికి తీశాడు నటసింహం. ‘ఆహా’ నుంచి ‘స్టార్ మా’ పట్టుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే బాలయ్యను సంప్రదించాలనే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. మరి ఫైనల్‌గా అబ్బాయ్ వస్తాడా.. లేకుంటే ఏకంగా బాబాయ్‌నే రంగంలోకి దింపుతారా.. లేదంటే నాగ్‌ను ఒప్పించి పట్టుకొస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Google News