Anu Emmanuel: అను.. ఏమైంది.. ఆరోగ్యంగానే ఉన్నావా..!

Anu Emmanuel

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలున్నా.. లేకున్నా నిత్యం ఏదో ఒక అప్డేట్‌తో అభిమానుల దగ్గరగా ఉంటారు. ఇక హీరోయిన్లు గురించి అయితే ప్రత్యేకించి మరీ చెప్పక్కర్లేదు. రోజూ ఫొటోలతో అభిమానులకు పిచ్చెక్కిస్తుంటారు. రోజుమాదిరిగానే మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యూయేల్ (Anu Emmanuel) పోస్ట్ చేసిన ఒక్క ఫొటో ఇప్పట్లో నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసమని ట్రెడిషనల్‌గా చీర కట్టింది అను. కట్టు, బొట్టు అంతా ఓకే గానీ.. నెటిజన్స్ ఎందుకో ఆమెపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేసేస్తున్నారు. బాబోయ్.. ఈ బ్యూటీ ఏంటిలా మారిపోయిందని కొందరు అంటుంటే.. బాగుందిగా అచ్చం బొమ్మలాగా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ‘అను నీకు హెల్త్ అంతా ఓకేనా’ అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. ఫొటోలో బాగా బక్కచిక్కిపోయింది అను. దీంతో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నారు నెటిజన్లు. ఇక అభిమానులు అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అని సలహాలిస్తున్నారు.

Anu Emmanuel 2

సినిమా ఛాన్స్‌లు రాకపోవడంతో ఆ మధ్య బ్యూటీ బాగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో భారీ కసరత్తులు చేసి తక్కువ సమయంలోనే బాగా బరువు తగ్గించేసింది. అప్పట్నుంచీ ఆరోగ్యం అంతగా సహకరించట్లేదని టాక్. అందుకే అనుపమ ఇలా కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాలో హాట్ హాట్ అందాల ఆరబోసేసింది అను. అస్సలు తనకంటూ లిమిట్స్ ఏమీ లేవు.. దేనికైనా రెడీ అన్నట్లుగా ఇండైరెక్టుగా ఈ సినిమాతో చెప్పేసింది ముద్దుగుమ్మ. సో.. ఇకనైనా సినిమా ఛాన్స్‌లు అమ్మడికి పెరుగుతాయేమో చూడాలి మరి.

Google News