Nayanthara: టాలీవుడ్ టాప్ హీరోలపై నయన్ క్రేజీ కామెంట్స్..

Nayantara Comments

ఏజ్ పెరుగుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) మాత్రమే. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజిబిజీగానే ఉంటుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందని ఫ్యాన్స్, సినీ ప్రియులు అనుకున్నారు కానీ.. ఇప్పుడే యమా స్పీడ్ పెంచేసింది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్‌సిరీస్‌‌లతో గ్యాప్ లేకుండా వరుసగా చేసేస్తోంది సుందరి. ఈ భామ ఇంతవరకూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సందర్భాలు చాలావరకు లేవనే చెప్పాలి. అయితే.. ‘కనెక్ట్’ సినిమా కోసం మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వక తప్పలేదు. అటు తమిళ్‌లో.. ఇటు తెలుగులో ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాను నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు మొదలుకుని కుర్ర హీరోల వరకు అందరిపైనా కామెంట్స్ చేసింది.

Nayantara Comments 2

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna), బాలకృష్ణ (Balakrishna), రవితేజ (RaviTeja), ప్రభాస్ (Prabhas), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)తో నటించిన నయన్.. (Nayanthara) తన అనుభవాలను పంచుకుంది. వెంకీతో ‘లక్ష్మీ’, ‘తులసి’, ‘బాబు బంగారం’ సినిమాల్లో జోడీ కట్టింది. వెంకీ తనకు తొలి హీరో అని.. ఆయనతో ఉంటే సెట్‌లో ఫ్యామిలీతో ఉన్నట్లే ఉంటుందని చెప్పింది. అంత పెద్ద హీరో అయినప్పటికీ ఆ ఫీలింగ్ లేకుండా నటించొచ్చని చెప్పింది. నాగ్‌ గురించి మాత్రం సింపుల్‌గా ‘ఆయనో అందగాడు’ అని చెప్పుకొచ్చింది.

చిరు గురించి మాట్లాడుతూ.. ఆయన టాప్ హీరో అయినా ఎప్పుడూ స్టార్‌డమ్ చూపించరని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం చిరుది అని చెప్పింది. ఆయనతో సినిమా చేసే నటీనటులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని లేడీ సూపర్‌స్టార్ (Nayanthara) చెప్పింది. రవితేజ గురించి చెబుతూ.. ఆయన తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. సినిమాలు చేసేటప్పుడు మొదలైన ఫ్రెండ్ షిప్‌ ఇప్పటికీ కంటిన్యూ అవుతోందన్నది. ఎవరికి వారు సినిమాల్లో బిజిబిజీగా ఉండటం వల్ల ఈ మధ్య కలవలేకపోయామని చెప్పిందామె. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయనో స్వీట్ హార్ట్ అని.. పెద్దస్టార్ కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నది.

బాలయ్య (Balakrishna)తో నటించాలంటే అందరూ భయపడతారు కానీ.. చాలా కూల్‌గా ఉంటారని, సరదాగా మాట్లాడుతుంటారని చెప్పింది నయన్. ఇక ఎన్టీఆర్ గురించి మాత్రం సుమారు నాలుగైదు నిమిషాలు మాట్లాడిందీ భామ. ‘ఒకసారి సెట్‌లో నేను రెడీ అవుతున్నాను. ఎన్టీఆర్ నన్ను చూసి ఎందుకంత మేకప్ వేసుకుంటున్నావ్. షాట్‌కు వెళ్లాలి కదా అని నేను రిప్లయ్ ఇచ్చాను. అబ్బే.. స్క్రీన్ మీద నన్నే కదా చూసేది.. నిన్నెవరు చూస్తారు. అంత రెడీ అవ్వాల్సిన అక్కర్లేదన్నాడు’ ఇలా ఎప్పుడూ ఎన్టీఆర్ జోక్స్ చేస్తూ ఉంటాడని లేడీ సూపర్‌స్టార్ చెప్పింది. ఏదైతేనేం.. సుమ ఇంటర్వ్యూతో నయన్ మనసులోని మాటలన్నీ బయటపడ్డాయ్. ఇక ఆమె నటించిన ‘కనెక్ట్’ చిత్రంలో ప్రేక్షకులకు పెద్దగా కొత్తదనం కనిపించలేదు.

Google News