Sreeleela: శ్రీలీల దెబ్బ.. ట్రోలర్స్ అబ్బా.. అసలేం జరిగింది..!

Sreeleela To Trollers

శ్రీలీల.. Sreeleela ‘పెళ్లి సందడి‘ (Pellisandadi) సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి.. తన అందం, చందంతో ‘ధమాకా’ ఉన్న హీరోయిన్ అని అనిపించుకుంది. చేసింది రెండు సినిమాలో అయినా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఇప్పుడు ఈ భామ చుట్టూ తిరుగుతున్నారు మేకర్స్. వాస్తవానికి తొలి సినిమాతోనే కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజ సరసన ‘ధమాకా’ (Dhamaka) లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.  తెలుగమ్మాయే కానీ.. పుట్టి పెరిగింది మాత్రం బెంగళూరులోనే. సినిమాల్లో నటిస్తూనే మెడిసిన్ చదువుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఫస్ట్ సినిమాతో ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేసింది. చూపించాల్సినవన్నీ చూపించేసి మేకర్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంది. దెబ్బకు పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అంతా ఓకే  కానీ.. ‘ధమాకా’ సినిమాలో నటించడంతో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు ప్రేక్షకులు, నెటిజన్లు. అంత పెద్ద హీరో అయినప్పటికీ.. శ్రీలల నటించి, మెప్పించిందని మెచ్చుకోవాల్సింది పోయి ఇదేం పోయే కాలమంటూ విమర్శిస్తున్నారు. రవితేజ- శ్రీలీలకు మధ్య ఏజ్ క్యాప్ చాలా ఎక్కువగా ఉంది.. మరీ ఆయనతో నటించడమేంటి..? అంకుల్ లాంటి వ్యక్తితో రొమాన్స్ ఏంటి..? ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిందేమో కానీ.. ఇంటర్వ్యూ వేదికగా ఇచ్చి పడేసింది.

Sreeleela To Trollers 2

నేను ఒక్కదాన్నే కాదు నటించింది.. నాకంటే ముందే హీరోయిన్స్‌గా చాలా మందే నటించారు. ఎంతో మంది వయసుకు మించిన వాళ్లతో రొమాన్స్ చేశారు. అలా నటించే హీరోయిన్‌గా సక్సెస్ అయ్యారు. వాళ్లే నాకు ఆదర్శం.. అందుకే నేను ఇలా చేశాను. పెద్ద పెద్ద హీరోయిన్స్‌నే అలా చేసినప్పుడు నేను చేయడంలో తప్పేంటి.. అసలు వాళ్ళ ముందు నేనంత చెప్పండి’ అంటూ దిమ్మతిరిగేలా కౌంటరిచ్చింది శ్రీలల. సో.. ఈ దెబ్బకు ఇక ట్రోలర్స్, నెటిజన్లు నోరు మూసేస్తారో లేదో చూడాలి మరి.

కాగా.. ఇప్పటి వరకూ తెలుగులో, కన్నడ భాషల్లో 6 సినిమాల్లో చేసింది. మరో నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మున్ముందు మరిన్ని సినిమా ఛాన్స్‌లు వస్తాయని.. ఇందులో ఎలాంటి ఢోకా లేదని సినీ విమర్శకులు సైతం చెబుతున్నారు. తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. అతి తక్కువ కాలంలోనే 1.2 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

Google News