Mahesh Babu: మహేశ్‌కు మదర్‌గా బీ టౌన్ బ్యూటీ ఫిక్స్..!

Mahesh Babu Mother

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బా (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో కమర్షియల్ మూవీ వస్తున్న విషయం విదితమే. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. తదుపరి షెడ్యూల్‌ను జనవరి రెండోవారం నుంచి షురూ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా.. మహేశ్ ఫ్యాన్స్‌ (Mahesh Babu Fans)కు అదిరిపోయే న్యూస్ బయటికొచ్చింది. ఇందులో మహేశ్‌కు తల్లిగా బాలీవుడ్‌ బ్యూటీ రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Rani Mukherjee

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ ముదురుభామ.. టాలీవుడ్‌లో మంచి కథ దొరికితే ఎంట్రీ ఇవ్వాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తోంది. అనుకున్నట్లు మంచి కథ.. పైగా మహేశ్‌ (Mahesh Babu) లాంటి సూపర్‌స్టార్‌కు తల్లిగా అనేసరికి మారుమాట చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. రాణీ పాత్ర సూపర్బ్‌గా ఉంటుందట. అంతేకాదు.. సగం సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందట.

Mahesh Babu Mother In New F

వైవిధ్యమైన కథతో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegde)ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీలల (Sreeleela) కూడా నటిస్తున్నట్లు తెలియవచ్చింది. అంటే రాణి ముఖర్జీ, పూజా హెగ్డే, శ్రీలల మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారన్న మాట. ఇక థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘అర్జునుడు’.. ‘అతడే పార్థు’ వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Google News