Chiranjeevi: దేవుడా ఇక చాలు.. సమాజానికి తిరిగిచ్చేస్తా..!

Chiranjeevi Service

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన వంతుగా ట్రస్ట్‌ ద్వారా సమాజానికి ఎంతో సాయం చేస్తున్నాడు. మరోవైపు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా కూడా కృషి చేస్తున్నాడు. అయితే ఆయన మనసులో ఇంకా చాలానే చేయాలని ఉంది. అందుకే ఇప్పటి వరకూ చేసింది చాలా తక్కువని.. ఇంకా సమాజానికి తిరిగిచ్చేయాల్సింది చాలా ఉందని భావిస్తున్నాడు చిరు. అందుకే పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఫిక్స్ అయ్యాడు చిరు.

డైరెక్టర్ కృష్ణవంశీతో ‘నేనొక నటుణ్ని’ షాయరీ అనుభవాన్ని చిరు (Chiranjeevi) వివరించాడు. ఇందులో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ‘ఇమేజ్ అనేది జీవితం కంటే ఎక్కువ’ అని అందరూ అనుకుంటున్నారని.. దాన్ని.. ‘వ్యక్తిగత జీవితం అనేది స్టార్‌డమ్ కంటే ఎక్కువ’ గా తిరగరాయాలని అనుకుంటున్నట్లు చిరు మనసులో మాట చెప్పేశాడు.

Chiranjeevi Donations

‘ఇన్ని రోజులూ.. నాకేంటి.. నా కుటుంబానికేంటి? అనే కోణంలోనే ఆలోచించాను. ఇక అది చాలు. నా కుటుంబ సభ్యులూ మంచి స్థాయిలోనే ఉన్నారు. దేవుడు నేను అనుకున్నదాని కంటే ఎక్కువే ఇచ్చాడు. అందుకే ఇక సమాజానికి తిరిగిచ్చేయాలని అనుకుంటున్నాను.  ఇప్పటి వరకూ ఇచ్చింది చాలా తక్కువ. ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది. కీర్తి, సినిమా గ్లామర్‌ అనేవి శాశ్వతం కాదు వ్యక్తిత్వమే శాశ్వతం అన్న దాన్ని నేను నమ్ముతా’ అని చిరు చెప్పుకొచ్చాడు. సో.. దీన్ని బట్టి చూస్తే చిరు మంచి అభిప్రాయంతోనే బయటికొస్తున్నారు. మెగాస్టార్ (Megastar) చేసే మంచి పనులు అర్హులకు అందాలని కోరుకుందాం.

Google News