Ravikrishna: రవికృష్ణకు బిగ్ బ్రేక్ ఇచ్చిన ‘విరూపాక్ష’.. అవకాశాలు క్యూ కడుతున్నాయట..

Ravikrishna 260423

కొందరు నటీనటులకు ఇండస్ట్రీలో జీవిత కాలం ఉన్నా కూడా మంచి బ్రేక్ అనేది మాత్రం రాదు. కొందరికి మాత్రం ఎప్పుడో ఒకసారి వరంలా దొరుకుతుంది. బుల్లితెర నటుడు రవికృష్ణ(Ravikrishna)కు ఇప్పుడది వరంలా దొరికింది. విరూపాక్ష(Virupaksha) సినిమాతో రవికృష్ణకు అదిరిపోయే బ్రేక్ దొరికింది. ఎప్పుడో ‘మొగలి రేకులు’ సీరియల్‌తో రవికృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సీరియల్ సూపర్ హిట్ అవడంతో అతనికి బుల్లితెరపై అవకాశాలు బాగానే దక్కాయి.

ఆ తరువాత తెలుగు బిగ్‌బాస్ ద్వారా కొంతకాలం ప్రేక్షకులను అలరించాడు. అతని మంచితనానికి బిగ్‌బాస్ వీక్షకులంతా ఫిదా అయిపోయారు. ముద్దుగా మంచోడు అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చేశారు. ఇక బిగ్‌బాస్ తర్వాత కూడా రవికృష్ణ(Ravikrishna) బుల్లితెరపైనే తన ప్రయాణం సాగించాడు. ఇన్నాళ్లకు ఆయన ఆశలు ఫలించాయి. వెండితెరపై మంచి అవకాశం వచ్చింది. విరూపాక్ష(Virupaksha) సినిమాలో ఒక కీ రోల్ దొరికింది. హీరో, హీరోయిన్ల తర్వాత ఆ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకున్న పాత్ర రవికృష్ణదే కావడం విశేషం.

virupaksha telugu movie

ఇక ఈ సినిమాలో రవికృష్ణ(Ravikrishna) నటన అదుర్స్ అనే చెప్పాలి. నిజానికి అతను కనిపించిన ప్రతిసారి ఆడియన్స్‌కి గూస్ బంప్స్ వచ్చాయి. కొన్ని సన్నివేశాలను థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆడియన్స్ చర్చించుకుంటున్నారు.

మొత్తానికి రవికృష్ణ(Ravikrishna)కు ఈ సినిమాతో మంచి నేమ్, ఫేమ్ వచ్చాయి. దీంతో అవకాశాలు క్యూ కడుతున్నాయట. మా రవికృష్ణ ఇక మీదట మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా మారబోతున్నాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇక రవికృష్ణ బుల్లితెరను వీడి వెండితెరపైనే సెటిల్ అవతాడేమో చూడాలి.

Google News