Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్.. బిజినెస్‌లో కింగ్స్.. ఎవరెవరు ఏం చేస్తున్నారంటే..!
టాలీవుడ్ స్టార్స్(Tollywood Stars) బిజినెస్‌లో కింగ్స్‌లా మారి రెండు చేతులా సంపాదిస్తున్నారు. మహేష్ బాబు(Mahesh Babu) నుంచి అల్లు అర్జున్(Allu Arjun) వరకూ ప్రతి ఒక్కరూ సైడ్ బిజినెస్‌లను ప్రారంభించారు. ఇక తామేమైనా తక్కువ తిన్నామా అంటూ స్టార్ హీరోయిన్స్ కూడా బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు. హీరోలకు ధీటుగా సరికొత్త బిజినెస్‌లలోకి అడుగు పెడుతున్నారు. అసలు ఏఏ స్టార్ హీరోలు బిజినెస్‌లో రాణిస్తున్నారు? ఏ బిజినెస్‌లో ఎంచుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారో చూద్దాం.
మహేష్ బాబు(Mahesh Babu) ఏఎమ్ బీ మాల్ (గచ్చిబౌలీ) పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత `ఏఎన్ రెస్టారెంట్స్ ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్ గ్రూప్‌ని రీసెంట్ గా ప్రారంభించారు. రామ్ చరణ్ ట్రూ జెట్ ఏయిర్ లైన్స్‌ను ప్రారంభించాడు. దానిని వదిలేశాడన్న వార్తలు కూడా వినిపించాయి. అల్లు అర్జున్.. ఏషియన్ అల్లు అర్జున్(Allu Arjun) సినిమాస్ (అమీర్ పేట్) తో పాటు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తన పేరునే బ్రాండ్‌గా మార్చి రౌడీ వేర్ క్లాతింగ్ బ్రాండ్, ఏవీడీ సినిమాస్ పేరుతో మహబూబ్ నగర్ హోమ్ టౌన్‌లో మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. ఇక సందీప్ కిషన్(Sundeep Kishan) వివాహ భోజనంబు రెస్టారెంట్, క్యూబిఎస్ సెలూన్‌ని ప్రారంభించాడు. రకుల్ ప్రీత్(Rakul Preet Singh) సింగ్ ఫిజికల్ ట్రైనింగ్ కోసం జిమ్‌లని నడిపిస్తోంది. కాజల్ అగర్వాల్ వచ్చేసి చెన్నైకి చెందిన ఆయుర్వేద కంపెనీ టీఏసీలో పెట్టుబడులు, సోదరితో కలిసి మర్సాలా జువెలరీ లేబిల్‌ని స్టార్ట్ చేసింది.
తమన్నా వచ్చేసి `వైట్ అండ్ గోల్డ్` పేరుతో సొంతంగా జువెలరీ బ్రాండ్‌ని నిర్వహిస్తోంది. మంచు విష్ణు(Vishnu Manchu) కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్ప్రింగ్ బోర్డ్, న్యూయార్క్ అకాడమీ స్కూల్స్‌ని సొంతంగా నిర్వహిస్తున్నాడు. సమంత(Samantha) వచ్చేసి సాకీ పేరుతో క్లాతింగ్ బ్రాండ్, సస్టైన్ కార్ట్, ఎస్వీఎస్ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీ, వైఅండ్ గోల్డ్ పేరుతో జువెలరీ బ్రాండ్‌లను నిర్వహిస్తోంది. శ్రియ వెల్ నెస్ సెంటర్ అండ్ స్పాలని ముంబాయి కేంద్రంగా రన్ చేస్తోంది. ఇక హీరోయిన్ ప్రణీత కూడా బెంగళూరులో రెస్టారెంట్ నిర్వహిస్తోంది.