Allu Arjun – Ram Charan: బన్నీ, చెర్రీ మధ్య కోల్డ్ వార్ వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లేనా?

Allu Arjun, Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ ఇటీవలి కాలంలో వార్తలు హోరెత్తాయి. బన్నీ కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరించాడు. చెర్రీ(Ram Charan) పుట్టినరోజును విస్మరించడం.. ఆస్కార్ వచ్చిన సందర్భంగా కూడా అంతా విషెస్ చెప్పాక తీరికగా నెక్ట్స్ డే చెప్పడం.. పైగా చెర్రీ(Ram Charan)ని గ్లోబల్ స్టార్ అని సంబోధించకపోవడం వంటి అంశాలను ఫ్యాన్స్ హైలైట్ చేశారు. ఇక మీడియా కూడా తన వంతు పాత్ర పోషించేసింది.

చెర్రీ(Ram Charan)కి, బన్నీ(Allu Arjun)కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ తోచిన రీతిలో కథనాలను వండి వార్చి వడ్డించేసింది. తాజాగా బన్నీ వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన వంతు ప్రయత్నమైతే తాను చేశాడు. ఉపాసన(Upasana) సీమంతం వేడుకకు కుటుంబంతో సహా వచ్చి ఉపాసనను ఆశీర్వదించాడు. అంతే కాదు. ఉపాసనతో కలిసి తీసుకున్న పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది ఉప్సి అని పోస్ట్ పెట్టాడు.

Allu Arjun at Upasana Konidela Baby Shower event

మొత్తానికి ఇటీవలి కాలంలో వస్తున్న కోల్డ్ వార్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు బన్నీ(Allu Arjun) తన వంతు ప్రయత్నమైతే చేశాడు. మరి ఇప్పటికైనా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూల్ అవుతాయో.. లేదంటే పిలిస్తే బాగోదని బన్నీ వచ్చి వెళ్లాడంటాయో చూడాలి.

ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీకి.. అల్లు ఫ్యామిలీకి పడటం లేదంటూ వార్తలు బీభత్సంగానే వస్తున్నాయి. అందుకే మెగా ఫ్యాన్స్ అనే ట్యాగ్ తీసేసి, తనకంటూ సొంతంగా అల్లు అర్జున్ ఆర్మీ అనే అభిమాన సంఘాన్ని పెట్టుకున్నాడని సోషల్ మీడియా టాక్.

Google News