బరువు పెరిగిందంటూ ట్రోల్స్.. ఇచ్చిపడేసిన హీరోయిన్

బరువు పెరిగిందంటూ ట్రోల్స్.. ఇచ్చిపడేసిన హీరోయిన్

బరువు పెరిగారంటే చాలు.. హీరోయిన్లకు ఇక్కట్లే. ఈ కాలంలో ముందుగా సినిమా అవకాశాల గురించి కాదు.. నెటిజన్ల నుంచి ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడాల్సి వస్తోంది. నిన్న మొన్నటి వరకూ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌(Kajal Aggarwal)ను బరువు పెరిగావంటూ నెటిజన్లు ఎంతగా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రముఖ నటుడు అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ వంతు వచ్చేసింది. ఆమెను కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సోనమ్(Sonam Kapoor).. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సైతం కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత ఒక పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇక తల్లిగా మారాక మాత్రం పూర్తి సమయం తన కుమారుడికే కేటాయించింది. అయితే గర్భవతి అయ్యాక బరువు పెరగడం సహజం. అయితే సోనమ్(Sonam Kapoor) బిడ్డ పుట్టాక కూడా బొద్దుగానే ఉంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ పెరిగాయి.

తనపై వస్తున్న ట్రోల్స్‌పై సోనమ్(Sonam Kapoor) కాస్తంత గట్టిగానే స్పందించింది. తానిప్పుడు తల్లినని, మెరుపుతీగలా సన్నగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. గర్భం ధరించాక శారీరక మార్పులు సర్వసాధారణమని.. బిడ్డ పుట్టాక కూడా ఆ బరువు కొన్నాళ్ల పాటు కొనసాగుతుందని సోనమ్(Sonam Kapoor) తేల్చి చెప్పింది. తను తల్లి అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఇప్పుడు బరువు గురించి చింత లేదని సోనమ్ స్పష్టం చేసింది. అసలు బరువు తగ్గేందుకు తొందరేమీ లేదని.. క్రాష్ డైట్ జోలికి వెళ్లనని తేల్చి చెప్పింది. తన శరీరంలో వచ్చిన మార్పులను ఆనందంగా స్వీకరిస్తున్నట్టు సోనమ్ తెలిపింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!