Telangana: నేషనల్ పార్టీల నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ.. మరి గులాబీ బాస్ ఏం చేస్తున్నారు?

Telangana: నేషనల్ పార్టీల నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ.. మరి గులాబీ బాస్ ఏం చేస్తున్నారు?

దాదాపు కర్ణాటక ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. ఇక జాతీయ పార్టీలన్నీ నెక్ట్స్ ఫోకస్ తెలంగాణపైనే పెట్టాయి. కర్ణాటకలో గెలుపోటములతో సంబంధం లేకుండా తెలంగాణపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అయితే గెలిచిన పార్టీకి కాస్త తెలంగాణలో అవకాశం ఎక్కువనే చెప్పాలి. అక్కడి విజయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా పార్టీలు మలచుకోనున్నారయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక అడుగు ముందుందనే చెప్పాలి. నేడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో యూత్ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. దీనిలో కీలకాంశాలన్నీ బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేవే కావడం గమనార్హం.

మరి గులాబీ బాస్ సైలెంట్‌గా ఉంటారా? అంటే అలాంటిదేం లేదు. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా ప్రస్తుత తరుణంలో కర్ణాటక ఫలితంపై సీరియస్‌గానే ఫోకస్ పెట్టింది. ఫలితం ఎలా ఉన్నా కూడా యాంటీ-బీజేపీ, యాంటీ-కాంగ్రెస్ ఫైట్‌పై పోరుకు సిద్ధమవుతోంది. ముందుగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని గులాబీ బాస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువ ఇబ్బంది అని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ప్రయత్నాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది.