AP Politics: హాట్ టాపిక్‌గా ఏపీ పొలిటిక్స్..

AP Politics: హాట్ టాపిక్‌గా ఏపీ పొలిటిక్స్..

ఏపీలో గెలుపెవరిది? ఎక్కడ చూసినా ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు విజయావకాశాలు ఎక్కువే కావడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ మాత్రం ఈసారి కూడా ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. టీడీపీ మాత్రం ఇప్పటి వరకైతే పక్కాగా జనసేనతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు బీభత్సంగా కనిపిస్తున్నాయి.

అయినా సరే.. జగన్ ఈసారి తనదే అధికారం అని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అంతే కాన్ఫిడెన్స్‌తో టీడీపీ కూడా ఉంది. ఎవరి కారణాలు వారికున్నాయి. ఎవరి అంచనాలు వారికున్నాయి. జగన్ ఏకైక ధీమా మాత్రం సంక్షేమ పథకాలు.

మరి సంక్షేమ పథకాలతో జగన్ గట్టెక్కుతారా? అంటే వాటినే నమ్ముకుంటే మాత్రం కష్టమే. ఇప్పటికే పన్నులు మాత్రం అందరం కట్టాలి. పథకాలు మాత్రం కొందరికేనా? అని జనం చర్చించుకుంటున్నారు. పైగా ఉద్యోగులు, నిరుద్యోగుల్లో బీభత్సమైన వ్యతిరేకత ఉంది. ఇక టీడీపీ, జనసేన కలిస్తే విజయం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు సామాజిక సమీకరణాలు మాత్రం బాగా కలిసొస్తాయి.

మరోవైపు రాజధాని అంశాన్ని టీడీపీ బాగా హైలైట్ చేస్తోంది. రోడ్ల దుస్థితిని.. వివేకా హత్యను హైలైట్ చేసి మరీ టీడీపీ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో విజయావకాశాలు ఇరు పార్టీలకు ఉన్నాయి. మరి ఏది గెలుస్తుందో వేచి చూడాలి.

Google News