డిక్లరేషన్ సంగతి దేవుడరుగు.. ఇలాగే ఉంటే కాంగ్రెస్ గతి అధోగతే..!

డిక్లరేషన్ సంగతి దేవుడరుగు.. ఇలాగే ఉంటే కాంగ్రెస్ గతి అధోగతే..!

ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక ఎన్నికలు పూర్తైతే పూర్తి స్థాయిలో తెలంగాణను టార్గెట్ చేయనుంది. ఈ క్రమంలోనే తొలుత రైతు డిక్లరేషన్.. తాజాగా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. రైతులను, యూత్‌ను తమ వైపు తిప్పుకునే యత్నం చేసింది.

అంతేనా.. ఇక ముందు చాలా డిక్లరేషన్‌లు రానున్నాయి. అన్ని వర్గాల ప్రజలనూ తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యత్నిస్తోంది. అయితే డిక్లరేషన్‌లు పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయా? అంటే అది జరగని పని అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో తీరు. ఒకరి మాట మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వినరు. పైగా పార్టీ ప్రయోజనాలకంటే వారికి వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యం. పార్టీ అధికారంలోకి రాకున్నా పర్వాలేదు కానీ తనకు మాత్రం పార్టీలో కీలక అధికారాలన్నీ దక్కాలనుకునే మనస్తత్వం ఉన్నవారు.

అసలు టీ కాంగ్రెస్‌లో ఉన్నన్ని కలహాలు వేరే ఏ రాష్ట్రంలోనూ లేవు. అసలు టీ కాంగ్రెస్ నేతలను ఒకరు ఓడించక్కర్లేదు. వారిని వారే ఓడించుకుంటారు. కూర్చొన్న కొమ్మని నరుక్కోవడం పరిపాటిగా వస్తోంది. అసలు ముందు పార్టీని క్రమశిక్షణలో పెట్టకుండా డిక్లరేషన్‌లు ప్రకటిస్తే ఉపయోగమేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Google News