Sreeleela: ఒక్క హిట్ లేకుండానే ఇన్ని సినిమాలా.. ఇదేం లీల..!?

సినిమాల్లో హీరో లేదా హీరోయిన్‌కు ఎంట్రీతోనే మంచి హిట్ పడితే చాలు.. ఇక డైరెక్టర్లంతా కథలు రెడీ చేసుకుని మరీ డేట్స్ కోసం వేచి చూస్తుంటారు. ఎంట్రీతోనే అదరగొట్టేసి స్టార్ హీరోలుగా రాణిస్తున్న నటీ, నటీమణులు చాలా మందే ఉన్నారు.. ఇందుకు ప్రత్యేకించి పేర్లేమీ అక్కర్లేదు. అయితే.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండా ఓ భామకు వరుస సినిమాల్లో ఛాన్సులు వస్తే.. పరిస్థితేంటి.. అవును ఇది నోరెళ్లబెట్టే పరిస్థితే అయినా అక్షరాలా నిజమే. ఇంతకీ ఎవరా బ్యూటీ..? వరుస సినిమాల్లో ఛాన్సులు ఎలా సాధ్యం..? ఏం చూసి అంతలా అవకాశాలిస్తున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం రండి.

యంగ్ బ్యూటీ శ్రీలల..(Sreeleela) ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ‘పెళ్లి సందడి’ (Pellisandadi) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి సినిమానే డిజాస్టర్ అయ్యింది. అయితే.. ఈ బ్యూటీ అందాలు, అభినయానికి మాత్రం కుర్రళ్లంతా పడిపోయారు. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ‘ధమాకా’ (Dhamaka) నటించింది. ఇది కూడా కాస్త అటు ఇటు తొలి ఫలితమే. రెండు సినిమాల్లో ఒక అమ్మడు ఫట్ అనిపిస్తే ఇక ఛాన్సులు ఎవరైనా ఇస్తారా అంటే.. మాకొద్దు బాబోయ్ అని తిన్నగా తప్పుకుంటారు మేకర్స్. అలాంటిది.. శ్రీలల (Sreeleela) విషయంలో మాత్రం ఫ్లాప్ అయినా సరే పాప కావాల్సిందే అని పట్టుబడుతున్నారు డైరెక్టర్స్, మేకర్స్.

ప్రస్తుతం శ్రీలల (Actress Sreeleela) చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అఫిషియల్‌గా అమ్మడే స్వయంగా చెప్పింది. అయితే అనఫియల్‌గా ఇంకా చాలానే ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్. ‘అనగనగా ఒక రోజు’, ‘జూనియర్’, బాలయ్య 108వ చిత్రం, రామ్-బోయపాటి కాంబోలో, వైష్ణవ్ తేజ్ Vaishnav Tej, నితిన్ Nithin, నవీన్ పొలిశెట్టి Naveen Polishetty.. ఈ అందరి సినిమాల్లో నటిస్తోందని అఫియల్‌గా ప్రకటనలు కూడా దాదాపు వచ్చేశాయ్. అంటే ఇప్పుడు మొత్తం వరుసగా 7 సినిమాలు చేతిలో ఉన్నాయ్. సో.. దీన్ని బట్టి చూస్తే జూనియర్లు మొదలుకుని సీనియర్లు వరకూ అందరితోనూ చేసేస్తోందన్న మాట.

మరీ ముఖ్యంగా ఒక్క హిట్ కూడా పడకుండానే ఇన్ని ఛాన్సులు వచ్చాయంటే.. అమ్మడికి మంచి హిట్ ఒక్కటి పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేస్కోండి. అసలు ఇన్ని ఛాన్సులు ఎలా సాధ్యం.. ఏమిటీ లీల అనేది శ్రీలీలే చెప్పాలి. అసలే అవకాశాలు రాని.. స్టార్ హీరోయిన్‌లుగా ఉన్న బ్యూటీలంతా వెళ్లి క్యూటీ దగ్గర క్లాసులు తీసుకోవాల్సిందే. రానున్న రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీని శ్రీలీల ఏలినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మరి.