Maa Bava Manobhavalu: ఈ దెబ్బతో రికార్డుల ‘మనోభావాలు’ దెబ్బతింటాయ్!

Maa Bava Manobavalu 1

నటసింహం బాలయ్య (Balakrishna) నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’(Veerasimha Reddy) సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయ్. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. చిరు ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సాంగ్స్‌ను సైతం ఢీ కొన్నాయి. తాజాగా ‘మా బావ మనోభావాలు’ (Maa Bava Manobhavalu) అనే స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది యూనిట్. ఈ సాంగ్ అదిరిపోతోంది. రిలీజ్ అయిన ఎనిమిది గంటల్లోనే 2.1 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాదు.. జనాలంతా చిరు మూవీలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ’.. బాలయ్య సినిమాలోని ‘మా బావ మనోభావాలు’ రెండు పాటలను పోలుస్తున్నారు కూడా. ఈ సాంగ్ గట్టి పోటీ ఇస్తుందని బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

బాలయ్యతో కలిసి ఐటమ్ బాంబ్ చంద్రికా రవి స్టెప్పులు ఇరగదీసింది. స్పెషల్ సాంగ్ కంపోజింగ్‌లో థమన్ మరోసారి తన మార్క్ బీట్ చూపించుకున్నాడని చెప్పుకోవచ్చు. సాంగ్ మొత్తం హై ఎనర్జీ సాగింది. అంతకుమించి రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్య ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, గాత్రం అందించిన ‘బాస్ పార్టీ’ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక థమన్.. బావ మనోభావాలు అని సంగీతం ఇరగదీశాడు. ఇద్దరిలో పైచేయి సాధించేది ఎవరో.. ప్రేక్షకులు రెండింటిలో దేన్ని హిట్ చేస్తారో కొద్దిరోజులు చూడాలి.

Maa Bava Manobavalu 2

ఇక బాలయ్య అభిమానులు మాత్రం అస్సలు ఆగట్లేదు. ‘సంక్రాంతి వరకు నా మనోభావాలను దాచుకుంటున్నా.. జై బాలయ్య.. జై బాలయ్య బాబు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. 62 ఏళ్ల వయసు వచ్చినా మిమ్మల్ని బీట్ చేసేవాళ్లు లేరు.. అందరికీ వయసు పెరిగితే అలుపొస్తుంది.. బాలయ్యకు మాత్రం ఊపొస్తుందని అంటున్నారు. ‘ఈ దెబ్బతో రికార్డుల మనోభావాలన్నీ దెబ్బ తినేలా ఉన్నాయి’ అని మరికొందరు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ‘స్టెప్పు స్టెప్పు కిక్కు వస్తోంది.. పాట పాటకి ఊపు వస్తోంది.. ఈ వయసులో ఇక నీ స్టెప్పులకు తిరుగులేదు.. జై బాలయ్య.. జై జై బాలయ్య’ అంటూ దండం పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. సాంగ్స్ వరకూ అటు వాల్తేరు.. ఇటు వీరసింహా గట్టిగానే కొట్టుకుంటూ వెళ్తున్నారు.. ఫైనల్‌గా థియేటర్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Google News