Samantha: సామ్.. నువ్వు ఉక్కుమనిషివి.. ఎప్పటికీ ఓడిపోవు..!

Samantha Ruth Prabhu

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. క్రిటికల్‌గా ఉందని.. ఎమర్జెన్సీలో చికిత్స తీసుకుంటోందని.. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేస్తోందని చాలా చాలా పుకార్లు.. షికార్లు చేశాయి. ఆ తర్వాత ముద్దుగుమ్మ మేనేజర్ స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలే అని కొట్టేపారేశాడు. దీంతో రూమర్స్‌కు చెక్ పడింది. ఈమెకు ఇప్పటి వరకూ పలు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ధైర్యం చెప్పారు. చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. ఈ క్రమంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran).. ఓ ఎనర్జిటిక్ మెసేజ్ పంపాడు. దీనికి సమంత ఫిదా అయిపోయి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Samantha

‘చీకటితో కూడిన సొరంగం.. కనుచూపు మేర అంతం లేదు.. వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడదీసుకుని ముందుకే సాగుతావు. భయాలు, సందేహాలు పక్కనబెట్టి సైనికుడిలా మారతావు. నువ్వు ఉక్కు మనిషివి. ఈ విజయం నీ జన్మహక్కు. నువ్వు చీకట్లో నడుస్తూనే ఉండు.. త్వరలోనే సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. నువ్వు ఓడిపోవు. ఈ కష్టకాలాన్ని ధైర్యంగా దాటగల నీలాంటి యోధులే పోరాటంలో గెలుస్తారు.. ఎందుకంటే ఏదీ నిన్ను ఓడించదు… మనుపటి కంటే మరింత బలంగా తయారుచేస్తుంది’ అని సామ్‌కు క్రిస్మస్ సందర్భంగా రాహుల్ ధైర్యం నూరిపోశాడు.

Rahul Instagram Post

సామ్-రాహుల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరికి ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది. సినిమాలు చేసినా చేయకున్నా ఇద్దరూ టచ్‌లోనే ఉంటుంటారు. సామ్‌ అనారోగ్యం గురించి బయటపెట్టిన తర్వాత ఇండస్ట్రీ అంతా అండగానే నిలిచింది. ఆఖరికి అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. చైతూ కూడా ఫోన్ చేసి పరామర్శించాడని అప్పట్లో వార్తలు కూడా గుప్పుమన్నాయ్. ఎవరెలా రియాక్ట్ అయ్యారనే విషయం పక్కనెడితే.. రాహుల్ మాత్రం మంచి మెసేజ్‌తో సామ్‌లో ఎనలేని ధైర్యం నింపాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సమంత ‘ఖుషీ’లో నటిస్తోంది. ఇక ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

Google News