Nayanthara: ఓహో.. ఇదా అసలు కథ.. నయన్ మనసులో మాట..!

నయనతార (Nayanthara) తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. రెండు, మూడు తరాల హీరోలతో నటించేసిందీ బ్యూటీ. అలా తమిళనాట లేడీ సూపర్‌స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. నయన్‌ను హీరోయిన్‌గా వర్క్ చేయించుకోవడం వరకూ ఓకే.. ఆమె నుంచి ఏ మేకర్ కూడా ఆడియో, ప్రీ రిలీజ్, సక్సెస్.. కనీసం ఇంటర్వ్యూలు కూడా ఆశించకూడదు.. ఇదే ఆమె పెట్టే పెద్ద రూల్. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. అస్సలు రాదుగాక రాదు. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉందట.

భర్త విగ్నేష్ (Vignesh Shivan) నిర్మాతగా వ్యవహరించిన ‘కనెక్ట్’ (Connect Movie) మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు కథ ఏంటో మొత్తం చెప్పేసింది. తాను మొదట్లో ప్రమోషన్స్‌కు వచ్చానని.. అయితే ఫంక్షన్లలో హీరోయిన్లకు అస్సలు విలువ ఇవ్వరని చెప్పింది. ఈ విషయం గ్రహించాను కాబట్టే దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈవెంట్స్ ఏవైనా సరే అన్నీ హీరో చుట్టూనే తిరుగుతాయని.. హీరోయిన్లను ఎక్కడో మూలకు నెట్టేస్తారని మనసులోని మాట చెప్పిందీ భామ.

Advertisement

ఆఖరికి ఇంటర్వ్యూల్లో కూడా హీరో గురించే హీరోయిన్ మాట్లాడాలి తప్ప.. ఆమె సొంత మాటలు మాట్లాడటానికి లేదన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ దగ్గరుండి చూశాకే హీరోయిన్లకు కొంచమైనా గౌరవం దక్కాలంటే.. ఇలా దూరంగా ఉండాలనే నిర్ణయించినట్లు చెప్పింది నయన్ (Nayanthara). ఈ భామ చెప్పిన మాటల్లో కాస్తో.. కూస్తో నిజమనేది లేకపోలేదు. అయితే.. ఈమె చేస్తున్నట్లుగా ఈ జనరేషన్ హీరోయిన్లు ఎవరైనా చేశారో అడ్రస్ గల్లంతే.. ఇది వందకు వంద శాతం కరెక్ట్.

అంతా ఓకే కానీ.. ‘కనెక్ట్’ సినిమాకే ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందని ఇప్పుడు నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీని భర్త విగ్నేష్ నిర్మించాడు సొంతింటి చిత్రం కాబట్టే.. నయన్ ఇలా చేసిందని విమర్శిస్తున్నారు. సొంత సినిమా కోసం ప్రమోషన్‌ సరే.. అవతలి నిర్మాతలు కూడా డబ్బేగా ఖర్చుపెట్టేది.. వెళ్లడానికేంటి సమస్యనే ప్రశ్నలు, విమర్శలు వస్తున్నాయి. సొంత విషయానికి ఒకలా.. వేరొకరి సినిమాకు ఇంకోలా.. ఏంటీ డబుల్ స్టాండర్డ్ అంటూ విమర్శలు మొదలయ్యాయ్. సో.. నయన్ (Nayanthara) చెప్పిన విషయాలతో ఇకనైనా మేకర్స్, డైరెక్టర్స్ కాస్త మారి.. హీరోయిన్లకు ప్రియారిటీ ఇస్తే మంచిదేమో..! అలాగే ఈ బ్యూటీ కూడా చేసిన సినిమాలన్నీ మనవే అన్నట్లుగా ప్రవర్తిస్తే మహా మంచిది మరి.