Chiranjeevi – RaviTeja : ప్రెస్‌మీట్‌లో రవితేజ పేరు మిస్సింగ్.. చిరు వివరణ

Chiranjeevi - RaviTeja

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి పండుగకు థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. పక్కా ప్లాన్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. నిన్న(28/12/2022) హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే.. సినిమా యూనిట్‌లోని అందరి గురించీ మాట్లాడారు కానీ.. అసలు సిసలైన వ్యక్తి మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం పేరు కూడా రాలేదు. దీంతో అటు మెగాభిమానులు, రవితేజ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యపోయారు. అసలు రవితేజ సినిమాలో ఉన్నారా లేదా..? ఉంటే చిరు ఎందుకు మరిచిపోయారు..?.. ఏమైనా విబేధాలున్నాయా అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ విషయాలన్నీ చిరు చెవిన పడటంతో ఎట్టకేలకు ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకున్నారాయన.

Waltair Veerayya Press Meet

ప్రెస్‌మీట్ పూర్తయ్యాక రవితేజ (Raviteja) పేరు మరిచిపోయాని ఎంతో ఫీలయ్యానన్నారు చిరు. నిజంగా ఇది తనకు ఎంతో లోటుగా అనిపించిందన్నారు. అందుకే ట్విట్టర్‌లో ప్రత్యేక వివరణ ఇచ్చారు. ‘ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) టీం అందరితో, మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈనాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా, టీం అందరూ ఎంతో సంతోషంగా, ఈ జర్నీ లో వాళ్ళ వాళ్ళ మెమోరీస్ పంచుకోవటంతో, ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంత సంతృప్తిగా జరిగింది. అయితే నా వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంలో.. చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను’ అని చిరు ట్వీట్ చేశారు.

అంతేకాదు.. ‘ వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చెయ్యాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి, కలసి షూట్ చేసిన ప్రతి రోజూ రవితో మళ్ళీ ఇన్నేళ్లకి చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాల్తేరు వీరయ్యలో రవితేజ  చేయకపోయుంటే అసంపూర్ణంగా వుండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం..’ అని చిరు ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా రవితేజ (Raviteja) కూడా రియాక్ట్ అయ్యారు. అన్నయ్యా.. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ట్వీట్స్ చూసిన మెగా ఫ్యాన్స్, రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Google News