Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా క్వీన్‌..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా క్వీన్‌..

కొందరు హీరోయిన్లు హిట్.. ఫట్‌లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లకు మాత్రం బ్రేక్ అనేది చాలా కష్టం. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో మాత్రం రాణించలేకపోతోంది. ఆమె పేరు దివ్యభారతి(Divya Bharathi).

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీ వీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) హీరోగా నటించిన ‘బ్యాచిలర్’(Bachelor) అనే సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అమ్మడికి ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ యూత్‌కి నిద్ర లేకుండా చేస్తోంది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా క్వీన్‌..

తాజాగా ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. దానికి తనపై షుగర్ చల్లి.. స్వీట్ అంటూ పిలవాలని పోస్ట్ పెట్టింది. అమ్మడి పిక్‌తో పాటు పెట్టిన కామెంట్ చూసిన నెటిజన్లు.. క్షణాల్లో లక్షాల్లో లైక్స్ ఇచ్చి.. వేలల్లో కామెంట్స్ పెట్టారు. అమ్మడికి సోషల్ మీడియాలో కావల్సినంత క్రేజ్ ఉన్నా కూడా అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు.

ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్న దివ్యభారతి.. తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కనున్న ‘గోట్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకు తిరుగుండదు.