Jr NTR: శ్రద్ధా, ఆలియాల మధ్య నలిగిపోతున్న ఎన్టీఆర్..!

Jr NTR: శ్రద్ధా, ఆలియాల మధ్య నలిగిపోతున్న ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Jr NTR)కు ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత అవకాశాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల్లో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా.. హిందీ మూవీ వార్ 2(War 2) లో నటించనున్నాడు. ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాలో శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) హీరోయిన్.. వార్ 2లో ఆలియా భట్(Alia Bhatt) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే.. ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఎన్టీఆర్‌కి తలనొప్పి తెప్పిస్తున్నారట. దీనికి కారణం లేకపోలేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) వెకేషన్ కి వెళ్లి తిరిగి రాగానే కొరటాల శివ మేకింగ్‌లో యాక్షన్ సీన్లు తెరకెక్కబోతున్నాయి. ఇవి త్వరగా ఫినిష్ చేసుకుని.. ప్రశాంత్ నీల్, వార్ -2 మూవీస్‌ను ఎన్టీఆర్ లైన్‌లో పెడతారట. ఇక వచ్చిన చిక్కల్లా శ్రద్ధా కపూర్, ఆలియా భట్‌‌లతోనే. ఈ ఇద్దరు చెరో మూడు సినిమాలు కమిట్ అయ్యారట. దీంతో ఎన్టీఆర్ డేట్స్‌కు ముద్దుగుమ్మల డేట్స్‌కు అస్సలు సెట్ కావడం లేదట. దీంతో చేసేదేమీ లేక యంగ్ టైగరే ఓ మెట్టు దిగొచ్చాడట. తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకుని రెండు మూవీస్‌కి నెలలో పది – పది రోజుల చొప్పున డేట్స్ కేటాయించాడని సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!